Skip to main content

Indian Economy: అంచెలంచెలుగా ఎదుగుతూ.. అగ్ర‌గామిగా నిలుస్తూ... ఏడున్న‌ర్ర ద‌శాబ్దాల‌లో దేశం సాధించిన ప్ర‌గ‌తి ఇలా...

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన‌ప్ప‌టినుంచి.. నేటి వ‌ర‌కు శాస్త్ర‌, సాంకేతికంగా, పారిశ్రామికంగా, సేవ‌ల ప‌రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాం. ఈ అభివృద్ధి ఒక్క రోజుతో సాధ్య‌ప‌డ‌లేదు. ఏడున్న‌ర ద‌శాబ్దాలలో అన్నిరంగాల్లో పురోగాభివృద్ధి సాధించాం. పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకుని, సుస్థిరాభివృద్ధి దిశ‌గా ఒడిఒడిగా అడుగులు వేస్తున్నాం.
Indian Economy
అంచెలంచెలుగా ఎదుగుతూ.. అగ్ర‌గామిగా నిలుస్తూ... ఏడున్న‌ర్ర ద‌శాబ్దాల‌లో దేశం సాధించిన ప్ర‌గ‌తి ఇలా...

ప్ర‌ఖ్యాత యూనివ‌ర్సిటీల ఏర్పాటు (1947-1960లు):
సిరిసంప‌ద‌లు, ఖ‌నిజాలు, వ‌నరుల‌తో విరాజిళ్తుతున్న భార‌త‌దేశాన్ని బ్రిటిష్ పాల‌కులు పీల్చిపిప్పిచేశారు. దీంతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో క‌నీస మౌలిక స‌దుపాయాలు క‌రువై తీవ్ర ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ఆర్థిక ప‌రంగా, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ప‌రంగా, పారిశ్రామికంగా స‌వాళ్లు ఎదుర‌య్యాయి.  

చ‌ద‌వండి: డిసెంబ‌ర్ నుంచి నిర్వ‌హించిన ప్ర‌తీ ప‌రీక్ష‌కు ఇదే ప్ర‌తిపాదిక‌.. రోస్ట‌ర్‌పాయింట్ల మేర‌కే ఉద్యోగం

iit delhi

జాతీయ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక విద్య ప‌రంగా ప్రోత్సాహం అందించ‌డానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), అలాగే ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీల‌ను ఏర్పాటు చేసింది.

చ‌ద‌వండి: తెలంగాణ‌లో ఎంబీబీఎస్ ఫీజులు పెంపు... బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సీటు...

సైన్స్ అండ్ టెక్నాల‌జీకి పెద్ద‌పీట‌ (1970-1980):
స్వాతంత్య్రం వ‌చ్చిన 20 ఏళ్ల‌కు పైగా దిగుమ‌తులపై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది. దిగుమ‌తుల‌ను త‌గ్గించుకుని ప్ర‌త్యామ్నాయ విధానాల‌పై ప్ర‌భుత్వాలు ద‌`ష్టి సారించాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉక్కు క‌ర్మాగారాలు, చమురు సంస్థ‌లు, ఎలక్ట్రానిక్స్ రంగాల‌లో ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన జ‌రిగింది. 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)తో సహా పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డీ) సంస్థలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం గణనీయమైన పాత్ర పోషించింది.

science

ఆర్థిక సరళీకరణ, ఐటీ విప్లవం (1990 ద‌శ‌కం):
ఏ దేశానికైనా పెట్టుబ‌డులే కీల‌కం. పెట్టుబ‌డులు వ‌స్తేనే ఉపాధి అవ‌కాశాలు మెరుగ‌వుతాయి. 1990 నాటికి భార‌త‌దేశం పీక‌ల్లోతూ క‌ష్టాల్లో మునిగిపోయి ఉంది. వీటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆర్థిక విధానాల‌ను స‌ర‌ళీక‌రించాల‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం భావించి, పెట్టుబ‌డుల‌కు(ఎఫ్‌డీఐ) ఎర్ర తివాచీ ప‌రిచి ఆహ్వానించింది. 

Economy

దీంతో దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో గణనీయమైన వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ క్లయింట్లకు సాఫ్ట్‌వేర్‌ డెవలవ్‌మెంట్, ఐటీ ఔట్ సోర్సింగ్ సేవలను అందిస్తూ భారతీయ ఐటీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి నగరాలు ప్రధాన ఐటీ హబ్ లుగా ఆవిర్భవించాయి.

మొబైల్స్‌ విప్లవం (1990-2000):
1995 మ‌ధ్య నుంచి దేశంలో టెలీక‌మ్యూనికేష‌న్స్ విప్ల‌వం ప్రారంభ‌మైంది. అదే స‌మ‌యంలో మొబైల్ ఫోన్ వినియోగం విప‌రీతంగా పెరిగింది. టెలికాం రంగంలో ప్రయివేటు సంస్థల ప్రవేశం, మొబైల్ టారిఫ్ ల తగ్గింపుతో మొబైల్ ఫోన్ వాడకం పెరిగి, లక్షలాది మందిని కనెక్ట్ చేసింది.

చ‌ద‌వండి: న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతం నుంచి వ‌చ్చి లండ‌న్‌లో 21 ల‌క్ష‌ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించానిలా...

స్టార్టప్, ఈ-కామర్స్ బూమ్ (2010):
2010 స‌మ‌యంలో మేథోవ‌ల‌స‌కు ఒక‌ర‌కంగా త‌గ్గిపోయింది. దేశంలోనే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉండ‌డంతో ఐడియాల‌ను పెట్టుబ‌డిగా మ‌ల్చుకున్నారు అనేక‌మంది యువ‌కులు. ఫ‌లితంగా వినూత్న ఐడియాల‌తో స్టార్ట‌ప్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. అదే స‌మ‌యంలో ఈ-కామర్స్ వృద్ధి చెందింది. ఈ-కామర్స్, ఫిన్‌టెక్, హెల్త్ కేర్‌, ట్రాన్స్‌పోర్టేషన్ సహా వివిధ రంగాల్లో వినూత్న పరిష్కారాలను సృష్టించడానికి కొత్త తరం పారిశ్రామికవేత్తలు టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. ఫ్లిప్ కార్ట్, ఓలా, పేటీఎం, జొమాటో వంటి సంస్థలు ఆయా రంగాల్లో అగ్రగామిగా నిలిచాయి.

startup

డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్:
దేశాన్ని డిజిటల్ సాధికారత కలిగిన సమాజం అలాగే నాలెడ్జ్ ఎకానమీగా మార్చాలనే లక్ష్యంతో 2015లో భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియాను ప్రారంభించింది. డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం, పౌరులకు ఎలక్ట్రానిక్ రూపంలో ప్రభుత్వ సేవలను అందించడంపై దృష్టి సారించింది. డిజిటల్ పేమెంట్స్, digilocker, ఫాస్టాగ్ మొదలైనవి ఈ కోవకి చెందినవే.

ఎమర్జింగ్ టెక్నాలజీస్:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), బ్లాక్ చెయిన్ వంటి టెక్నాలజీల్లోనూ భారత్ పురోగతి సాధించింది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, స్మార్ట్ సిటీలతో సహా వివిధ రంగాల్లో నూత‌న‌ సాంకేతికతకు పెద్ద‌పీట వేస్తోంది. ప్రైవేటు రంగంతో పాటు ప్రభుత్వ రంగంలోని సంస్థ‌లూ ఈ రంగాల‌లో రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నాయి.

చ‌ద‌వండి: ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి.. వ‌రుస‌గా మూడు ఉద్యోగాలతో అద‌ర‌గొట్టిన తెలంగాణ యువ‌కుడు

స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత అన్నిరంగాల్లోనూ ఒక్కోమెట్టూ ఎక్కుతూ స్వావ‌లంబ‌న దిశ‌గా భార‌త‌దేశం అడుగులు వేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్ప‌టికే ప‌లుదేశాల‌కు స‌వాలు విసురుతోంది. అయిన‌ప్ప‌టికీ దేశాన్ని మౌలిక స‌దుపాయాల లేమి, నైపుణ్యాల కొరత వంటి సవాళ్లు వేధిస్తున్నాయి. ఈ సమస్యలను అధిగ‌మించి.. సాంకేతిక పురోగతిని మరింత వేగవంతం చేసి అగ్ర‌గామి దేశంగా అవ‌త‌రించేందుకు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగాలు నిరంతరం కృషి చేస్తున్నాయి.

Published date : 11 Aug 2023 03:49PM

Photo Stories