Skip to main content

Riya Philip: న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతం నుంచి వ‌చ్చి లండ‌న్‌లో 21 ల‌క్ష‌ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించానిలా...

ఇప్పుడిప్పుడే మైదాన ప్రాంతాల్లోనూ అన్ని సౌక‌ర్యాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత‌మంచింది. ఇక బీమారు రాష్ట్రాల్లో ఒక‌టైన చ‌త్తీస్‌ఘ‌డ్‌లో ప‌రిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవాలంటేనే భ‌య‌మేస్తుంది. ఇప్ప‌టికీ ఆ రాష్ట్రంలో నక్స‌ల్స్‌ క‌దలిక‌లు ఉన్నాయి.
Riya Philip
న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతం నుంచి వ‌చ్చి లండ‌న్‌లో 21 ల‌క్ష‌ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించానిలా...

నక్సల్స్ ప్ర‌భావిత జిల్లాలో ఎప్పుడు ఎక్క‌డ మందుపాత‌ర పేలుతుందోన‌ని భ‌యం. సుక్మా జిల్లాలో నక్సల్స్‌ బాధిత దోర్నపాల్‌కి చెందిన బస్సు డ్రైవర్‌ కూతురు రియా ఫిలిప్‌. ఆ ప్రాంతం అంతా న‌క్స‌ల్స్‌ భయం ఎక్కువ. ఎప్పుడూ పోలీసుల కర్ఫ్యూ, తుపాకీ మోతలు, ఆర్తనాదాలతో అట్టుడుకిపోతుండేది.

ఇవీ చ‌ద‌వండి: ఓ పేదింటి బిడ్డ 'ఎస్ఐ' ఉద్యోగం కొట్టిందిలా.. ఈమె విజ‌యం కోసం..

Riyaphilip

ఇలాంటి భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితుల నుంచి వ‌చ్చింది రియా. త‌న బతుకు ప్రయాణం సాఫీగా సాగాలంటే చదువు ఒక్క‌టే ఆయుధ‌మ‌ని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యింది. ఎన్ని భయాలు ముందున్నా వెరవక చదువుపై దృష్టి పెట్టింది. ఆమె తల్లి షోలీ ఫిలిప్‌ ప్రైవేటు స్కూల్‌ టీచర్‌ కాగా, తండ్రి రితేష్‌ ఫిలిప్‌ అదే స్కూల్‌లో బస్సు డ్రైవర్‌.

త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ క‌ష్ట‌ప‌డితేనే వారి కుటుంబం గడుస్తుంది. కానీ, తాము తిన్నాతిన‌కున్నా పిల్ల‌ల‌ను మంచిగా చదివించాల‌ని ఆ త‌ల్లిదండ్రులిద్ద‌రూ నిర్ణ‌యించుకున్నారు. పిల్ల‌ల‌ను మంచిగా చ‌దివించాలంటే మంచి పాఠ‌శాల‌ల్లో చేర్చించాల‌నుకున్నారు. దీనికితోడు న‌క్స‌ల్స్ భ‌యం. దీంతో తాముంటున్న దుబ్బతోట గ్రామం నుంచి దోర్నపాల్‌కి వెళ్లిపోయారు. 

ఇవీ చ‌ద‌వండి: ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి.. వ‌రుస‌గా మూడు ఉద్యోగాలతో అద‌ర‌గొట్టిన తెలంగాణ యువ‌కుడు

ఈ ఘ‌ట‌న‌తో ఇద్ద‌రికీ ఉపాధిపోయింది. ఫ‌లితంగా కుటుంబం గ‌డ‌వ‌డ‌మే క‌ష్ట‌మైంది. కానీ, పిల్ల‌ల చ‌దువును నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. త‌ల్లిదండ్రుల క‌ష్టాన్ని చూస్తూ పెరిగిన రియా... వారి ఆశను ఒమ్ము చేయ‌లేదు. బాగా చదివి ముంబైలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం సంపాదించింది. 

Riyaphilip

ఇవీ చ‌ద‌వండి: క‌ష్టాల‌ను అధిగ‌మించి.. నాసాలో కొలువు సాధించా... పులివెందుల‌ కుర్రాడు హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌రెడ్డి

అక్కడ రెండేళ్ల పాటు ఉద్యోగం చేసిన త‌ర్వాత యూకేలో ఉద్యోగం సంపాదించింది. కానీ, ఆమె లండన్‌ వెళ్లేందుకు చేతిలో చిల్లిగ‌వ్వ‌లేదు. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఇంటిని తాకట్టుపెట్టి రూ.3 లక్షలు సమకూర్చారు. ఫ‌లితంగా ఆమె లండన్‌లో రూ. 21 లక్షల వార్షిక ప్యాకేజితో ఉద్యోగాన్ని సంపాదించింది. 

ప్ర‌స్తుతం రియా ఫిలిప్ స‌క్సెస్‌స్టోరీ దేశ‌వ్యాప్తంగా వైర‌ల‌య్యింది. మావోయిస్టు ప్ర‌భావిత జిల్లా నుంచి వ‌చ్చి యూకేలో ఉద్యోగం సాధించిన యువ‌తిపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. 

Published date : 08 Aug 2023 10:51AM

Photo Stories