Success Story: కష్టాలను అధిగమించి.. నాసాలో కొలువు సాధించా... పులివెందుల కుర్రాడు హర్షవర్దన్‌రెడ్డి సక్సెస్ స్టోరీ
సాక్షి, ఎడ్యుకేషన్: కడప జిల్లాకు చెందిన ఈశ్వర్ రెడ్డి, శివ పార్వతి దంపతులకు హర్షవర్థన్ రెడ్డి, నందన్‌రెడ్డికుమారులు. బతుకుదెరువు కోసం వీరు పదేళ్లకిందట కడప నుంచి గుంటూరు జిల్లాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈశ్వర రెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉన్నంతలో ఇద్దరు పిల్లలను మంచిగా చదివించాడు.
ఇవీ చదవండి: డ్యూటీ చేస్తూనే సొంత ప్రిపరేషన్‌తో మెడికల్ సీటు సాధించా... నా సక్సెస్ జర్నీ సాగిందిలా
ఇద్దరు కుమారులు చిన్ననాటి నుంచే చదువులో చురుగ్గా ఉండేవారు. పెద్ద కొడుకు హర్షవర్థన్ రెడ్డి పులివెందులలో పదవ తరగతి వరకూ చదివి హైదరాబాద్ శ్రీ చైతన్యలో ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం జేఈఈలో మంచి ర్యాంకు సాధించి ఐఐటి గౌహతిలో సీటు సాధించాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన హర్షవర్థన్ రెడ్డి సిల్వర్ మెడల్ సాధించాడు.
ఇవీ చదవండి: అనారోగ్యంతో భర్త చనిపోయాడు... ఆయన చివరికోరికే నన్ను 51 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా చేసింది
హర్షవర్దన్‌రెడ్డి ప్రతిభను గుర్తించిన ఓఎన్‌జీసీ సంస్థ రూ.లక్ష ఉపకార వేతనం, బంగారుపతకం అందించింది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్ కోసం కెనడా వెళ్లాడు. 2015లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం పీహెచ్‌డీ చేయాలనుకున్నాడు. అందుకు కుటుంబ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో పీహెచ్‌డీ చేసేందుకు సొంతంగా సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇవీ చదవండి: 36 లక్షల వేతనాన్ని వదిలేసి సివిల్స్ వైపు అడుగులు... వరుసగా మూడు ప్రయత్నాల్లో ఫెయిల్... చివరికి సక్సెస్ సాధించానిలా
2015 నుంచి 2017 వరకు రిలయన్స్ సంస్థలో ఉద్యోగం చేశాడు. తర్వాత కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు దరఖాస్తు చేశాడు. అక్కడ సీటు రావడంతో ఏరో స్పేస్‌లో పీహెచ్‌డీ జాయిన్ అయ్యాడు. ఆ సమయంలోనే నాసాలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కోర్సు పూర్తి చేసి జులై 10న కాలిఫోర్నియాలోని నాసా ఫీల్డ్ సెంటర్‌లో ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టాడు.
చిన్నకుమారుడు నందన్‌రెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ పరీక్ష కోసం ప్రిపేరవుతున్నాడు. ఇద్దరు కుమారులు ప్రయోజకులు కావడంతో ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేవు. తమ పిల్లలు పదిమందిలో మంచి పేరు సాధించడం తమకెంతో ఆనందంగా ఉందని ఈశ్వర్‌రెడ్డి, పార్వతి దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.