Success Story: అనారోగ్యంతో భర్త చనిపోయాడు... ఆయన చివరికోరికే నన్ను 51 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా చేసింది...: గరిమా శర్మ సక్సెస్ స్టోరీ
రాజస్థాన్‌కు చెందిన గరిమా శర్మ, సందీప్ కుమార్ శర్మ దంపతులు. సందీప్‌కుమార్ ఉన్నత ఉద్యోగం చేసేవాడు. గరిమా జైపూర్‌లోని వివిధ కళాశాలలు, పాఠశాలల్లో పాఠాలు బోధించేంది. అయితే ప్రభుత్వ ఉద్యోగం విలువ తెలిసిన సందీప్‌కుమార్ తన భార్యను ప్రభుత్వ ఉద్యోగంపై ద`ష్టి సారించాలని కోరేవాడు.
భర్త కోరికను ఆమె ఏనాడు సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, 2014లో సందీప్ శర్మ అస్వస్థకు గురయ్యాడు. హాస్పిటల్‌లో చికిత్స తీసుకునే సమయంలో కాలేయ సమస్యతో బాధపడుతున్న విషయం గరిమకు తెలిసింది. భర్తను బతికించుకునేందుకు తన కాలేయంలో కొంతభాగాన్ని కూడా ఇచ్చింది.
ఇవీ చదవండి: IAS Success Story: ఆల్ ఇండియా సివిల్స్ టాపర్ ఈ కలెక్టర్... సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి హైదరబాద్ కలెక్టర్‌గా...
కానీ, ఆరోగ్యం విషమించి 2014లోనే భర్త మరణించాడు. చనిపోయేముందు కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భార్యను కోరాడు సందీప్ శర్మ. భర్త మాటలను అప్పటివరకు సీరియస్‌గా తీసుకోని గరిమ.. తన భర్త చివరి కోరికను నెరవేర్చాలని బలంగా సంకల్పం తీసుకుంది. రెండేళ్లపాటు కష్టపడి చదివింది.
2016లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షలు రాసింది. తన మొదటి ప్రయత్నంలోనే ఆమె విజయం సాధించింది. ఆ పరీక్షలో తహసీల్దార్‌గా ఉద్యోగం సాధించింది. ప్రభుత్వ ఉద్యోగాలను గరిష్ట వయసు 40 సంవత్సరాలే. కానీ, గరిమకు వితంత కోటాలో వయోపరిమితిలో మినహాయింపు లభించింది.
ఇవీ చదవండి: కూలీనాలీ చేసుకుంటూ చదువుకున్నా.. ఇప్పుడు గర్వంగా పీహెచ్‌డీ సాధించా... ఈ చదువుల తల్లికి సలాం కొట్టాల్సిందే
2018లో మళ్లీ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాసింది. ఆ ఫలితాలు 2021లో విడుదలయ్యాయి. ఈసారి ఏకంగా ఆమె సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ఉద్యోగానికి ఎంపికైంది. అప్పటికి గరిమ వయసు 51 ఏళ్లు. ప్రస్తుతం రాజస్థాన్లోని బగోడాకు ఎస్డీఎంగా విధులు నిర్వహిస్తున్నారు.
క`షి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న నానుడికి గరిమా శర్మ జీవితమే ఉదాహరణ. గరిమ లాంటి మహిళను ఆదర్శంగా తీసుకుంటే.. లక్ష్యాన్ని సాధించేందుకు వయసు అనేది సమస్యకాదని తెలుస్తుంది.