Skip to main content

Inspirational Story: కూలీనాలీ చేసుకుంటూ చ‌దువుకున్నా.. ఇప్పుడు గ‌ర్వంగా పీహెచ్‌డీ సాధించా... ఈ చ‌దువుల త‌ల్లికి స‌లాం కొట్టాల్సిందే

మ‌ట్టిలో మాణిక్యం ఆమె. కూలీ ప‌నికి వెళ్తే కానీ డొక్కాడ‌ని ప‌రిస్థితి. ఎన్ని ఆర్థిక స‌మ‌స్య‌లు వెన‌క్కిలాగుతున్నా చదువులో ఎప్పుడూ ముంద‌డుగే వేసింది. చిన్న వ‌య‌సులోనే పెళ్లైనా త‌ర్వాత త‌ల్లిగా మారినా ఏనాడూ చ‌దువును నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. ఇప్పుడు ఆ ఫ‌లితమే పీహెచ్‌డీ రూపంలో ఆమె ముందుకు వ‌చ్చి నిల్చొంది. ఇప్పుడామె కూలీ భార‌తి కాదు.. డాక్ట‌ర్ భార‌తి... భార‌తి స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా...
Sake Bharathi
కూలీనాలీ చేసుకుంటూ చ‌దువుకున్నా.. ఇప్పుడు గ‌ర్వంగా పీహెచ్‌డీ సాధించా... ఈ చ‌దువుల త‌ల్లికి స‌లాం కొట్టాల్సిందే

పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేసింది అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం గ్రామానికి చెందిన భార‌తి. చిన్నప్పటి నుంచీ బాగా చదువుకోవాలనుకునేది భారతి. పదో తరగతి వరకూ శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్‌ పామిడి జూనియర్‌ కాలేజీలో పూర్తిచేసింది. తల్లిదండ్రులకు ముగ్గురాడపిల్లలు. వారిలో ఈమే పెద్దది. వీరందరి బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక మేనమామ శివప్రసాద్‌తో తనకి పెళ్లి చేశారు. భవిష్యత్తు గురించి ఎన్ని కలలున్నా...ఆ విషయం భర్తకు చెప్పలేక పోయింది. ఆమె కోరికను అర్థం చేసుకున్న ఆమె భ‌ర్త‌ పై చదువులు చదివేందుకు ప్రోత్సాహం అందించాడు.

Success Story: అమెరికాలో అద‌ర‌గొడుతున్న భార‌తీయ మ‌హిళ‌... వంద‌ల కోట్ల వ్యాపారంతో ప‌దిమందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న జోయా

sake bharthi
పారాగాన్ చెప్పుల‌తో, భ‌ర్త‌..కూతురితో భార‌తి

భర్త ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. భ‌ర్త‌కు చేదోడువాదోడుగా నిలుస్తూ కాలేజీకి వెళ్తూనే సెల‌వురోజుల్లో కూలీ పనులకు వెళ్లేది. అలా అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. చ‌దువుకునే స‌మ‌యంలోనే ఆమెకు  కూతురు గాయత్రి జ‌న్మించింది. ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే చదువూ, పనులూ చేసుకునేది. రోజూ రాత్రి పొద్దుపోయే వరకూ పుస్తకాలతో కుస్తీ పట్టేది.

Inspirational Person: 82 ఏళ్ల వ‌య‌సులో సైకిల్‌ మెకానిక్‌కు పద్మశ్రీ... ఎందుకు ఇచ్చారో మీకు తెలుసా..?

కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకూ నడిచి వెళ్లి అక్కడ బస్సెక్కేది. ఇన్ని కష్టాల మధ్య భారతి డిగ్రీ, పీజీ మంచి మార్కులతో పూర్తిచేసింది. 

SK University

చ‌దువుల్లో ఆమె ప్ర‌తిభ‌ను చూసిన టీచర్లూ పీహెచ్‌డీ చేయాల‌ని సూచించారు.  ప్రొఫెసర్‌ డా.ఎంసీఎస్‌ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్‌’ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. అయినా తను కూలి పనులు మానలేదు. తాజాగా ఆమె శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజ‌రై ర‌సాయ‌న‌శ్రాస్తంలో ఆమె చేసిన ప‌రిశోధ‌న‌ల‌కు పీహెచ్‌డీ పట్టా తీసుకుంది. పారగాన్‌ చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకుని పీహెచ్‌డీ ప్ర‌దానోత్స‌వానికి హాజ‌రైన భార‌తిని చూసి కార్యక్ర‌మానికి హాజ‌రైనవారంతా ఆశ్చ‌ర్చ‌పోవ‌డం విశేషం. 

Success Story: ఒక‌టి త‌ర్వాత ఒక‌టి... ఆరు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన హైద‌రాబాదీ కుర్రాడు... ఎలా సాధించాడంటే..

Published date : 18 Jul 2023 06:51PM

Photo Stories