Skip to main content

Success Stroy : ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. కానీ నా ల‌క్ష్యం ఇదే..

ప్ర‌స్తుతం పోటీరంగంలో ఒకే ఒక్క ఉద్యోగం సాధించాలంటే.. ఎంతో క‌ష్ట‌ప‌డాలి. అది కూడా వ‌స్తుంద‌ని గ్యారెంటీ లేదు. కానీ ఈ యుమ‌తి ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనేలా చేసింది.
కేతావత్ నిఖిత

ఈమే తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన కేతావత్ నిఖిత. ఈ నేప‌థ్యంలో కేతావత్ నిఖిత స‌క్సెస్ స్టోరీ మీ కోసం..

కుటుంబ నేప‌థ్యం : 
నిఖిత.. తండ్రి సర్దార్ సింగ్. ఈయ‌న‌ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. త‌న కూతురు ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

☛ Success Story : ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. 4 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. కానీ..

ఎడ్యుకేష‌న్ : 
నిఖిత.. తన పాఠశాల విద్యను మంచిర్యాలలోని ప్రైవేట్ పాఠశాలలో చదివింది. ఆ తరువాత మెదక్‌లోని మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ పూర్తి చేసింది. మ‌ళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే.. ఇంగ్లీష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 

☛ Inspirational IAS Success Story : డబ్బు కోసం ఆ ప‌ని చేశా.. చివ‌రికి ఇలా చ‌దివి ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యానిలా.. కానీ..

ఆరు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
నేను 2023లో నా చదువు పూర్తి అయినా వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాను. నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యాను. ఇటీవలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  వెల్లడించిన ఫలితాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సంపాదించాను. అలాగే  గ్రూప్-4 ఉద్యోగానికి కూడా ఎంపిక‌య్యాను. ఇవే కాకుండా రెసిడెన్షియల్ స్కూలులో టీచర్‌గా, జూనియర్ లెక్చరర్‌గా, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా, అలాగే PGT టీచర్‌గానూ ఎంపిక‌య్యాను.

☛ IPS Officer Success Story : ఎటువంటి కోచించి లేకుండానే.. సివిల్స్ కొట్టా.. ఐపీఎస్ అయ్యా.. కానీ

ఇలా ఒక్క ఏడాది వ్యవధిలోనే ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం చేసుకున్నాను. యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావాలనేది నా లక్ష్యమని నిఖిత అన్నారు. ప్రస్తుతం నిర్మల్‌లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో డిగ్రీ లెక్చరర్‌గా పని చేస్తున్నాను.

☛ Village Success Story : ఈ గ్రామంలో ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌, జడ్జీ ఉద్యోగాల‌తో పాటు.. ఇంకా ఎన్నో.. ఒకప్పుడు ఈ ఊరిలో దారుణంగా..!

Published date : 10 Aug 2024 04:32PM

Photo Stories