IPS Officer Success Story : ఎటువంటి కోచించి లేకుండానే.. సివిల్స్ కొట్టా.. ఐపీఎస్ అయ్యా.. కానీ
కానీ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన మహేశ్ బి.గీతే మాత్రం ఎటువంటి కోచింగ్ లేకుండానే.. రెండో ప్రయత్నంలోనే ఐసీఎస్ కొట్టాడు. ఈ నేపథ్యంలో ఈ యువ ఐపీఎస్ మహేశ్ బి.గీతే సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన బాబా సాహెబ్, సోజల్ దంపతుల రెండో సంతానం మహేశ్ బి.గీతే. పూర్తిగా వ్యవసాయ కుటుంబనేపథ్యంలోనే పెరిగారు. వ్యవసాయంలో తల్లిదండ్రుల కష్టాలను చూసి అగ్రికల్చర్ బీఎస్‌సీ చదువేందుకు పూణే వెళ్లారు.
వీరి ఇచ్చిన సలహాతోనే సివిల్ వైపు..
మహేశ్ బి.గీతే.. అగ్రికల్చర్ బీఎస్‌సీ చదివారు. గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో సీనియర్లు ఇచ్చిన సలహాతో సివిల్ సర్వీసెస్ వైపు దృష్టి సారించారు. ఎటువంటి కోచింగ్ లేకుండా నిరంతర సాధన చేశారు. రెండో ప్రయత్నంలో ఐసీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం చొప్పదండి ఠాణాలో శిక్షణ ఐపీఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
డిగ్రీ పూర్తి కాగానే 2020లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యారు. మొదటి ప్రయత్నంలో లక్ష్యం చేరకపోవడంతో రెండోసారి ప్రయత్నించారు. ఎటువంటి ప్రత్యేక కోచింగ్‌లు తీసుకోకుండా రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ప్రస్తుతం చొప్పదండి పోలీస్‌స్టేషన్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
మూడు నెలల పాటు ఇక్కడ..
ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్ నియంత్రణపై దృష్టి సారిస్తాం. ఎస్సీ,ఎస్టీ కేసులపై అవేర్‌నెస్ పెంచుతాం. భూమి తగాదా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అధికారుల సహకారంతో సమస్యలు పరిష్కరిస్తాం. మూడు నెలల పాటు ఇక్కడ విధులు నిర్వహిస్తానని మహేశ్ బీ. గీతే. వివరించారు.