Inspirational IAS Success Story : డబ్బు కోసం ఆ పని చేశా.. చివరికి ఇలా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానిలా.. కానీ..
ఈమే తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందినది రమ్య. ఈమె సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 46వ ర్యాంక్ సాధించి.. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రమ్య IAS సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
కోయంబత్తూర్‌కు చెందిన రమ్య సివిల్ సర్వీస్‌లో చేరేందుకు చిన్నప్పటి నుంచి కష్టపడాల్సి వచ్చింది. రమ్య కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో క్లిష్ట పరిస్థితుల్లో తల్లి పెంచింది. ఈమె చదువుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది.
ఎడ్యుకేషన్ :
కుటుంబాన్ని ఆర్థికంగా దృఢంగా తీర్చిదిద్దేందుకు వీలైనంత త్వరగా తన కాళ్లపై నిలబడి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్న రమ్య.. ఇందుకోసం 10వ తరగతి పరీక్ష అనంతరం పాలిటెక్నిక్ డిప్లొమాలో అడ్మిషన్ తీసుకుంది. డిప్లొమాలో వచ్చిన మంచి మార్కుల ఆధారంగా కోయంబత్తూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మిషన్ తీసుకుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసింది. తర్వాత IGNOUలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు.
సివిల్స్ వైపు..
ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేశారు. అయినా ఆమెకు ఏదో సాధించాలనే తపన పెరిగింది. స్నేహితులు, అధ్యాపకుల సలహాలు, సూచనలతో యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టింది. 2017లో యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు సిద్ధం కావడానికి బెంగళూరులోని ఒక ఇన్‌స్ట్రుమెంటేషన్ కంపెనీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. ఆమె అక్కడ 3 సంవత్సరాలకు పైగా పనిచేశారు.
Success Story: కోటి జీతాన్ని వదులుకుని.. తొలి ప్రయత్నంలో ఐఏఎస్
డబ్బు కోసం..
యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న సమయంలో ఆర్థిక భారం పెరిగింది. దీంతో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేశారు. ఆమె యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష ప్రిపరేషన్ కోసం.. డబ్బు సంపాదించడానికి డేటా ఎంట్రీ ఉద్యోగం ఎంతగానో ఉపయోగపడింది.
మొదటి లేదా రెండవ ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్స్ పరీక్షను క్లియర్ చేసిన చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే యూపీఎస్సీ సివిల్స్ పరీక్షను క్లియర్ చేయడానికి రెండు లేదా మూడు కంటే ఎక్కువ ప్రయత్నాలు చేసిన వారు కొందరు ఉన్నారు. ఈమె మాత్రం ఐఏఎస్ అధికారిగా మారడానికి చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకంగా ఉంటుంది. ఐఏఎస్ అధికారిణి రమ్య ఆరో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021లో జాతీయ స్థాయిలో 46వ ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించింది. అలాగే రాష్ట్ర స్థాయిలో ఈమె రెండో ర్యాంక్ సాధించారు.
➤☛ Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
ప్రిలిమ్స్ కూడా గట్టెక్కలేక..
ఈమె మొదటి సంవత్సరంలోనే నిరాశ పరిచింది. ప్రిలిమ్స్ కూడా గట్టెక్కలేక పోయింది. తర్వాత రెండు ప్రయత్నాలలో కూడా అలానే సాగింది. ఇలా.. ఆరో ప్రయత్నంలో ఆమె సివిల్ సర్వీసెస్ సాధించింది. యూపీఎస్సీ జర్నీలో తన తల్లి ఎప్పుడూ తన వెంటే ఉండేదని చెప్పుకొచ్చారు.
నా సలహా ఇదే..
పరీక్షకు సిద్ధమవుతున్న ఔత్సాహికులకు రమ్య సలహా ఏమిటంటే.. వారు తమ పరిస్థితిని ఎప్పుడూ బలహీనతగా భావించకూడదు.. బదులుగా దానిని మంచి ప్రారంభ స్థానంగా ఉపయోగించుకోవాలని సూచించింది. ఫెయిలుర్స్ కేవలం మీకు అనుభవ సాధనాలే కానీ.. అవే మీకు చివరి అవకాశాలు కావంటూ చెప్పుకొచ్చారు. వాటి నుంచి ఇంకా ఎక్కవ విషయాలను గ్రహించి ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుందన్నారు.