Skip to main content

UPSC Ranker Shivangi Goyal: వీళ్ల హింస‌ను భ‌రించ‌లేక పుట్టింటికి వ‌చ్చా.. ఈ క‌సితోనే సివిల్స్‌ ర్యాంక్ కొట్టానిలా..

దేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్‌ పోస్టులైన ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర ఆలిండియా సర్వీస్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్‌–2021 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) మే 30న విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
UPSC Ranker Shivangi Goyal
శివాంగి గోయల్‌, యూపీఎస్‌సీ-2021 ఆలిండియా 177వ ర్యాంక‌ర్‌

ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 685 మందిని ఆయా క్యాడర్‌ పోస్టులకు ఎంపిక చేసింది. ఈ ఫ‌లితాల్లో ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లాకు చెందిన శివాంగి గోయల్‌ తాజాగా వెలువడిన యూపీఎస్‌సీ-2021 ఫలితాల్లో ఆలిండియా 177వ ర్యాంకు సాధించారు. ఈమె కట్నం వేధింపులతో అత్తింటి నుంచి పుట్టింటికి చేరుకున్న.. ఆమె తన కల సాకారం చేసుకోవడమే కాక గృహహింస బాధితురాళ్లకు ఆదర్శంగా నిలిచారు. ఆదర్శ‌వంత‌మైన ఈమె స‌క్సెస్ స్టోరీ మీకోసం..

Yaswanth Kumar Reddy, Civils 15th Ranker: సివిల్స్‌లో నా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే.. వీరు లేకుంటే..

కుటుంబ నేప‌థ్యం :
శివాంగి తండ్రి రాజేశ్‌ గోయెల్‌ వ్యాపారి కాగా, తల్లి సామాన్య గృహిణి. 

ఈ క‌సితోనే..
ఆమెకు పెళ్లై, ఏడేళ్ల వయసు కుమార్తె ఉంది. భర్త, అత్తింటి వారు కట్నం కోసం పెడుతున్న వేధింపులతో విసిగి పుట్టింటికి చేరుకున్నారు. ప్రస్తుతం విడాకుల కేసు నడుస్తోంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అంటూ నాన్న అభయహస్తమిచ్చారు. యూపీఎస్‌సీకి మరోసారి ఎందుకు సిద్ధం కాకూడదని అప్పుడే ఆలోచించా అని శివాంగి చెప్పారు. స్కూల్లో చదివే రోజుల్లోనే యూపీఎస్‌సీకి ప్రిపేర్‌ కావాలంటూ ప్రిన్సిపాల్‌ సలహా ఇచ్చారు. అప్పటి నుంచే ఐఏఎస్‌ కావాలని కలలుగనేదాన్ని. అదే నా లక్ష్యంగా ఉండేది అని అన్నారు.

UPSC Civil Services Results: సివిల్స్‌ సర్వీసెస్‌ ఫలితాల విడుదల.. టాప‌ర్లు వీరే..

ఎన్ని అవాంతరాలున్నా..
రెండుసార్లు యూపీఎస్‌సీ పరీక్ష రాశాక పెళ్లయింది. అత్తింటి వారి వేధింపులతో కూతురితో పుట్టింటికి వచ్చేశా అని అన్నారు. చిన్ననాటి కల నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఎన్ని అవాంతరాలున్నా ప్రిపరేషన్‌పైనే దృష్టిపెట్టా. సోషియాలజీ సబ్జెక్టుగా సొంతంగా చదువుకుని పరీక్షకు ప్రిపేరయ్యా. అనుకున్నది సాధించా అన్నారు.

UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

వీరి సహకారం వల్లే..

UPSC Ranker Shivangi Goyal Success Story


‘‘నా తల్లిదండ్రులు, కుమార్తె రైనా సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైంది. నేటి మహిళలు అత్తింట్లో జరగరానిది జరిగితే, భయపడకూడదు. ధైర్యంగా నిలబడి సొంత కాళ్లపై నిలబడాలి. మహిళలు అనుకుంటే ఏమైనా చేయగలరు. మీరు బాగా చదువుకుని.. బాగా కష్టపడితే ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కాగలరి యూపీఎస్సీ ర్యాంక‌ర్ శివంగి చెప్పారు.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి

Published date : 01 Jun 2022 06:07PM

Photo Stories