UPSC Civil Services Results: సివిల్స్ సర్వీసెస్ ఫలితాల విడుదల.. టాపర్లు వీరే..
అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని ఎంపిక చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు.
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
ఈసారి అమ్మాయిలదే హవా..
సివిల్స్ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా చాటారు. నలుగురు టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం. 2021 సివిల్స్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచింది శృతి శర్మ. రెండో ర్యాంకర్‌గా అంకితా అగర్వాల్, మూడో ర్యాంకర్ గామిని సింగ్లా నిలిచారు.
Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీళ్లే..
1. యశ్వంత్ కుమార్ రెడ్డి- 15వ ర్యాంక్
2. పూసపాటి సాహిత్య- 24వ ర్యాంక్
3. శృతి రాజ్యలక్ష్మి- 25వ ర్యాంక్
4. రవి కుమార్-38వ ర్యాంక్
5. కొప్పిశెట్టి కిరణ్మయి- 56వ ర్యాంక్
6. పాణిగ్రహి కార్తీక్- 63వ ర్యాంక్
7. సుధీర్ కుమార్ రెడ్డి- 69వ ర్యాంక్
8. శైలజ- 83వ ర్యాంక్
9. శివానందం- 87వ ర్యాంక్
10. ఆకునూరి నరేశ్- 117వ ర్యాంక్
11. అరుగుల స్నేహ- 136వ ర్యాంక్
12. గడిగె వినయ్‌కుమార్- 151వ ర్యాంక్
13. దివ్యాన్షు శుక్లా- 153వ ర్యాంక్
14. కన్నెధార మనోజ్‌కుమార్- 157వ ర్యాంక్
15. బి చైతన్య రెడ్డి- 161వ ర్యాంక్
16. దొంతుల జీనత్ చంద్ర- 201వ ర్యాంక్
17. సాస్యరెడ్డి- 214వ ర్యాంక్
18. కమలేశ్వర్‌రావు- 297వ ర్యాంక్
19. నల్లమోతు బాలకృష్ణ- 420వ ర్యాంక్
20. ఉప్పులూరి చైతన్య- 470వ ర్యాంక్
21. మన్యాల అనిరుధ్- 564వ ర్యాంక్
22. బిడ్డి అఖిల్- 566వ ర్యాంక్
23. రంజిత్‌కుమార్- 574వ ర్యాంక్
24. పాండు విల్సన్- 602వ ర్యాంక్
25. బాణావత్ అరవింద్- 623వ ర్యాంక్
26. బచ్చు స్మరణ్‌రాజ్- 676వ ర్యాంక్
Mahesh Bhagwat, IPS : గైడెన్స్ లేకనే ఫెయిల్ అయ్యా..అందుకే ఇలా చేస్తున్నా..
పోస్టుల వారీగా చూస్తే..
జనరల్ కోటాలో 244 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌కు 180, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీకి 242 మంది ఎంపిక కాగా, మరో 90 మంది గ్రూప్ బీ సర్వీసులకు ఎంపికైనట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.
UPSC Civil Service 2021 final results: Check direct link here
యూపీఎస్సీ-2021 పరీక్షలు జరిగాయి ఇలా..
యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్-2021 ప్రిలిమినరీ పరీక్ష గతేడాది అక్టోబర్ 21న నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 29న విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు మెయిన్స్ నిర్వహించారు. ఈ ఫలితాలు మార్చి 17న ప్రకటించారు. అందులో అర్హత సాధించిన వారికి ఏప్రిల్ 5 నుంచి మే 26 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. చివరిగా మే 30వ తేదీ(సోమవారం) తుది ఫలితాలను విడుదల చేశారు.
గత సంవత్సరం సివిల్స్ ర్యాంకర్ల వివరాలు ఇవే..
సివిల్స్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థులు వీరే..