UGC NET June 2024 Results: యూజీసీ-నెట్ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోవచ్చు!
Sakshi Education
యూజీసీ-నెట్ జూన్ 2024 పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. రేపు(అక్టోబర్ 18)న ఫలితాలను విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
UGC NET June 2024 Results
యూజీసీ నెట్ పరీక్షలు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4వరకు జరిగిన సంగతి తెలిసిందే. పరీక్ష జరిగి నెల రోజులు దాటినా ఇంత వరకు ఫలితాలు విడుదల చేయకపోవడంతో లక్షలాదిమంది విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
కాగా భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ‘అసిస్టెంట్ ప్రొఫెసర్’ అలాగే ‘జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్’ అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి యూజీసీ నెట్ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. యూజీసీ-నెట్ ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో రెండుసార్లు నిర్వహిస్తారు