Summative Results:సమ్మేటివ్, అసెస్‌మెంట్ పరీక్షల ఫలితాలను తప్పనిసరిగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి
Sakshi Education
చిత్తూరు : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు గత విద్యాసంవత్సరం సమ్మేటివ్, అసెస్‌మెంట్ పరీక్షల ఫలితాలను తప్పనిసరిగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని డీఈఓ దేవరాజు ఆదేశించారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అప్‌లోడ్ ప్రక్రియను ఎంఈఓలు పకడ్బందీగా పర్యవేక్షించాలని తెలిపారు. నమోదు చేయకపోతే హెచ్‌ఎంలపై శాఖాపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. యూడైస్ వివరాలు కూడా పకడ్బందీగా నమోదు చేయాలని తెలిపారు. పున: ప్రారంభానికి ముందస్తుగా పాఠశాలలను పరిశుభ్రం చేయించాలన్నారు. ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్‌ల పెంపునకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీవైఈఓ చంద్రశేఖర్, ఎంఈఓలు సెల్వరాజ్, మోహన్, పలు మండలాల ఎంఈఓలు పాల్గొన్నారు.
Also Read: కొత్త వైద్య కళాశాలలకు 380 పోస్టుల మంజూరు
Published date : 03 Jun 2024 10:56AM