Skip to main content

UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

సివిల్స్‌ సర్వీసెస్‌-2021 ఫలితాలు మే 30వ తేదీన (సోమవారం) ఉదయం విడుదల చేశారు. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని ఎంపిక చేసింది యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ బోర్డు.
UPSC Civils Topper shruti sharma
UPSC Civils Topper Shruti Sharma

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2021 ఫలితాల్లో శృతి శర్మ ఆల్‌ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ మాట్టాడుతూ.. యూపీఎస్‌సీ పరీక్షలో అర్హత సాధిస్తానని తనకు నమ్మకం ఉందని.. అయితే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగించిందని శృతి శర్మ అన్నారు. ఐఏఎస్‌లో చేరి దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నట్టుగా ఆమె తెలిపారు.

UPSC Civil Services Results: సివిల్స్‌ సర్వీసెస్‌ ఫలితాల విడుదల.. టాప‌ర్లు వీరే..

కుటుంబ నేప‌థ్యం :
ఆమె ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందినవారు. 

ఎడ్యుకేష‌న్‌: 
ఆమె హిస్టరీ స్టూడెంట్. ఢిల్లీ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని St. Stephens College పట్టభద్రులయ్యారు. అలాగే జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

సివిల్స్ కోచింగ్ కోసం..
యూపీఎస్సీ సీఎస్‌ఈ పరీక్ష కోసం చాలా కాలం శిక్షణ పొందినారు. జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (RCA)లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు. హిస్టరీని తన ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. నాలుగేళ్ల పాటు సివిల్స్‌ కోసం కఠోర శ్రమ, ఎంతో ఆత్మవిశ్వాసంతో చదివి.. ఎట్ట‌కేల‌కు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2021 ఫలితాల్లో శృతి శర్మ ఆల్‌ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకొని అద్భుతం సృష్టించారు.

Success Story: ఈ లెక్కలే.. న‌న్ను 'ఐఏఎస్‌' అయ్యేలా చేశాయ్‌.. ఎలా అంటే..?

నా విజ‌యంలో క్రెడిట్ వీరిదే..
ఎంతో కష్టంతో కూడుకున్న ఈ ప్రయాణంలో తన తల్లిదండ్రులతో పాటు స్నేహితులు కూడా పూర్తిగా తనకు సహకరించారని చెప్పారు. ఇలాంటి ఫలితాన్ని తాను ఊహించలేదనీ.. టాపర్‌గా నిలవడం ఎంతో సర్‌ప్రైజింగ్‌లా ఉందన్నారు.  ‘‘నా జర్నీలో నాకు సహకరించిన ప్రతిఒక్కరికీ ఈ క్రెడిట్‌ దక్కుతుంది. ప్ర‌త్యేకంగా నా తల్లిదండ్రులు నాకు పూర్తి మద్దతుగా నిలిచారు. కొందరు స్నేహితులు నన్ను గైడ్‌ చేశారు’’ అన్నారు.

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

UPSC Civil Services Toppers List :
Rank 1: Shruti Sharma

Rank 2: Ankita Agarwal

Rank 3: Gamimi singla

Rank 4: Aishwarya Verma

Rank 5: Utkarsh Dwivedi

Rank 6: Yaksh Chaudhary

Rank 7: Samyak S Jain

Rank 8: Ishita Rathi

Rank 9: Preetam Kumar

Rank 10: Harkeerat Singh Randhawa

Rank 11: Shubhankar Pratyush Pathak

Rank 12: Yasharth Shekhar

Rank 13: Priyamvada Ashok Mhaddalkar

Rank 14: Abhinav J Jain

Rank 15: C YashwanthKumar Reddy

Rank 16: Anshu Priya

Rabk 17: Mehak Jain ‘ Rabk 18: Ravi Kumar Sihag

Rabk 19:Diksha Joshi

Rank 20: Arpit Chauhan

Rank 21: Dilip K Kaunukkara

Rank 22: Sunil Kumar Dhanwanta

Rabk 23: Ashish

Rank 24: Puapati Sahitya

Rank 25: Shruti Rajlakshmi

Rank 26: Utsav Anand

Rank 27: Saksham Goel

Rank 28: Manti Mourya Bhardawaj

Rank 29:Bhavishya

Rank 30: Naman Goyal

Published date : 30 May 2022 06:38PM

Photo Stories