UPSC Civils Ranker Kote Anil Kumar : బలమైన కోరికతోనే..ఏఈ ఉద్యోగాన్ని వదిలేసి.. సివిల్స్ వైపు వచ్చా.. కానీ..
Sakshi Education
ఇటీవలే విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాల్లో వరంగల్ నగరానికి చెందిన కొటె అనిల్‌కుమార్ 743వ ర్యాంకు సాధించారు. రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి కొటె కొమురయ్య, సరోజన దంపతుల కుమారుడు అనిల్. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు శివనగర్ రెనాల్డ్ స్కూల్, ఐదు నుంచి పది వరకు ప్లాటినం జూబ్లీ హైస్కూల్, ఇంటర్ విజయవాడ నారాయణ జూనియర్ కాలేజీలో చదివాడు. వరంగల్ నిట్‌లో ట్రిపుల్-ఈ చదివాడు.
ఏఈ వదిలేసి..
హైదరాబాద్ ఎస్‌పీపీడీసీల్‌లో ఏఈగా మూడేళ్లు పని చేశారు. సివిల్స్ లక్ష్యంతో ఉద్యోగం వదిలేసి ప్రిపేర్ అయ్యారు. 2021 సివిల్స్ ఫలితాల్లో వచ్చిన ర్యాంకుతో వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పోస్టల్ ఎకౌంట్స్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ ఉద్యోగంలో చేరారు. ఎలాగైనా ఐపీఎస్ సాధించాలనే పట్టుదలతో గతేడాది సివిల్స్ రాయగా.. ఇటీవలే విడుదలైన తుది ఫలితాల్లో అనిల్‌కుమార్‌కు 743వ ర్యాంకు వచ్చింది.
నా కొడుకుకు ఐపీఎస్ కావాలన్నది బలమైన కోరిక..
నా కొడుకుకు ఐపీఎస్ కావాలన్నది బలమైన కోరిక. ఈసారి వచ్చిన ర్యాంకుతో ఐపీఎస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అందుకే మరోసారి (ఆరో సారి) ప్రయత్నించి తన కలను నెరవేర్చుకుంటాడు అని అనిల్ తండ్రి కొమురయ్య తెలిపారు.
Published date : 20 Apr 2024 11:06AM
Tags
- UPSC Civils Ranker Success Story
- UPSC Civils Ranker Kote Anil Kumar Success Story
- UPSC Civils Ranker Kote Anil Kumar Inspire Story
- UPSC Civils Ranker Kote Anil Kumar Real Life Story
- UPSC Civil Ranker Success Story
- UPSC
- Competitive Exams Success Stories
- UPSC jobs
- upsc civils 2023
- Civil Services Success Stories
- Success Story
- motivational story in telugu
- KOTE ANIL KUMAR UPSC Civils Ranker Real Life Story
- KOTE ANIL KUMAR UPSC Civils Ranker 2023 Story in Telugu
- KOTE ANIL KUMAR UPSC Civils Ranker Family
- KOTE ANIL KUMAR UPSC Civils Ranker Family Latest News
- UPSC Civils 2023 results
- Civil services exam result
- sakshieducation interviews