Skip to main content

UPSC Civils 22nd Ranker Pavan Datta Interview : నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..|ఈ ల‌క్ష్యం కోస‌మే సివిల్స్ వైపు వ‌చ్చా..

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్‌–2022 పరీక్షల తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. జాతీయస్థాయిలో టాప్‌ ర్యాంకులను సాధించి రికార్డు సృష్టించారు. సివిల్స్‌–2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మే 23వ తేదీన (మంగళవారం) విడుదల చేసిన విష‌యం తెల్సిందే. సివిల్స్ జాతీయ స్థాయి పరీక్షల్లో తిరుపతికి చెందిన పవన్ దత్త 22వ ర్యాంక్ సాధించాడు. అలాగే ఈయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టాప్‌-1 ర్యాంక్ సాధించాడు. ఈయ‌న తిరుపతిలో పవన్ దత్త ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తిచేశారు. తండ్రి వెంకటేశ్వర్లు ఎల్ఐసిలో పనిచేస్తారు. తల్లి టీచర్. రైల్వే కోడూరులో ఉద్యోగం చేస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ఆల్ ఇండియాలో 22వ ర్యాంకు సాధించారు. ఈ నేప‌థ్యంలో G.V.S పవన్ దత్త తో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

Photo Stories