APPSC Group 1 Ranker Pavani Success Story : తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 ఉద్యోగం కొట్టానిలా.. కానీ..
నెల్లిమర్ల మండలంలోని మారుమూల గ్రామమైన అలుగోలుకు చెందిన పావని తండ్రి నారాయణప్పలనాయుడు రేషన్ షాపు డీలర్‌కాగా, తల్లి భారతి అంగన్‌వాడీ టీచర్. పావని పదో తరగతి వరకు గ్రామంలోని ఉన్నత పాఠశాలలోనే విద్య నభ్యసించారు. పదో తరగతి టాపర్‌గా నిలిచి విశాఖలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు.
అనంతరం కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేసి.. ఉద్యోగ సాధనలో నిమగ్నమయ్యారు. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న పావని ఆ దిశగా 2022 లో పరీక్ష రాసి కేవలం 14 మార్కుల కటాఫ్‌తో ఉద్యోగానికి దూరమయ్యారు.. గ్రూప్–1 పరీక్షలో విజేతగా నిలిచి డీఎస్పీ ఉద్యోగం సాధించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ సివిల్స్ సాధనకు శిక్షణ పొందుతున్నారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తొలి ప్రయత్నంలోనే డీఎస్పీగా ఎంపికకావడం సంతోషంగా ఉందని, సివిల్స్‌లో సత్తాచాటి కలెక్టర్ కావడమే లక్ష్యమని పేర్కొన్నారు.