APPSC Group1 Ranker Success Story : మా అమ్మనాన్న కూలికి వెళ్తేనే.. మాకు అన్నం
పేరు పల్లెం శ్రీనివాసులు ( శ్రీరామ్ చంద్ర). మాది వైఎస్సార్ జిల్లాలోని గోవవరం మండలంకి చెందిన అడుసువారి పల్లె అనే ఒక మారుమూల గ్రామం. అమ్మా, నాన్న వ్యవసాయ కూలీలు. కిరోసిన్ బుడ్డి వెలుతురులో నా చదువు ప్రారంభమైంది. దట్టమైన అడవుల మధ్యలో అటు తూర్పు మల్లెం కొండ శ్రేణి, ఇటు పడమర శ్రేణి మధ్య పాయలాంటి ప్రాంతంలో మా గ్రామం ఉండేది. అందువల్ల మా మండల ప్రాంతాన్ని పాయకట్టు అని పిలుస్తారు. అలాంటి పరిస్థితులలో పిల్లల చదువుకోసం ఊర్లో వారంతా మాట్లాడుకొని పూసలమ్మే వారి తెగకు చెందిన సుబ్బయ్య అనే మాస్టారును మాకు గురువుగా విద్యను బోధించడానికి ఒప్పించారు. ఒక చిన్న పూరి గుడిసెలో, నేల మీద నా విద్యాభ్యాసం ప్రారంభం అయింది. 5వ తరగతి వరకు ఆ పూరి గుడిసెలోనే ఏకోపాధ్యాయుని పర్యవేక్షణలో రామాయణం, మహా భారతంలోని పద్యాలు, శ్లోకాలు మరియు పెద్ద బాల శిక్ష అధ్యయనం చేశాను.
బడికి వెళ్ళాలంటే భయం ఎందుకంటే..?...