UPSC Civils 3rd Ranker Uma Harathi Interview : నా సక్సెస్ సీక్రెట్ ఇదే.. | ఈ లక్ష్యం కోసమే..
ఓటమి ఎదురైనపుడు కుంగిపోకుండా వాటినుంచి పాఠాలు నేర్చుకుంటేనే పురోగతి సాధ్యం. జాతీయ స్థాయిలో జరిగే అత్యున్నత పరీక్షలు రాసే అభ్యర్థులు తాము చేసిన లోపాలు గుర్తించడం, వాటిని సరిదిద్దుకోవడం తప్పనిసరి. తాజా సివిల్ సర్వీస్ 2022 పరీక్షల ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు.. తెలంగాణకు చెందిన నూకల ఉమా హారతి. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించిన ఉమా హారతితో సాక్షి ప్రత్యేక ఇంటర్య్వూ మీకోసం..
ప్రతి రంగంలోనూ విజయం సాధించిన ప్రతి ఒక్కరి నుంచీ ఏదో ఒక విషయంలో స్ఫూర్తి పొందవచ్చు. ఒకటి రెండుసార్లు విఫలమైనప్పటికీ ఆందోళన పడకూడదు. ఇది వరకు సివిల్స్ సాధించినవారి సహకారం తీసుకుని తప్పులు జరుగకుండా జాగ్రత్తపడాలి. ప్రతిరోజు చదవడం, ప్రాక్టీసు చేయడం మంచిది. వారానికోసారి చదివిన అంశాలను ప్రాక్టీస్ టెస్టు రాయడం అలవాటుచేసుకోవాలి. పరీక్షలో ఎన్నిసార్లు విఫలమైనా ఫెయిల్యూర్‌గా భావించకూడదు. మనం ఎల్లప్పుడు సానుకుల వాతావరణంలో ఉండాలి.. ఏది జరిగిన మన మంచికే అనే విధంగా ఉండాలి. ఓటమి నుంచి మెలకువలు నేర్చుకోవాలి.