Skip to main content

UPSC-2021 Civils Ranker : తొలిసారి దారుణంగా ఓటమి.. ఈ సారి గురి త‌ప్ప‌కుండా కొట్టానిలా..

గుంటూరు శ్యామలా నగర్‌కు చెందిన కాకుమాను అశ్విన్‌ మణిదీప్‌ సివిల్స్‌లో 235 ర్యాంకు సాధించారు. మణిదీప్‌ తండ్రి కిషోర్, తల్లి ఉమాదేవి ఉపాధ్యాయులు. ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు ఇంటి పక్కనే ఉన్న వెంకటేశ్వర బాలకుటీర్‌లో చదివాడు. ఇంటర్‌లో జేఈఈ మెయిన్స్‌ స్కోర్‌ ఆధారంగా ఇస్రో ఆధ్వర్యంలో నడిచే ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్సెస్‌ టెక్నాలజీలో బీటెక్‌ ఏరో స్పేస్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన మణిదీప్‌ ఆ తరువాత నుంచి సివిల్స్‌కు ప్రిపేరవుతూ వచ్చారు. 2019లో తొలి ప్రయత్నం చేయగా.. ప్రిలిమ్స్‌ కూడా క్లియర్‌ చేయలేకపోయాడు. 2020లో మరోసారి సివిల్స్‌ పరీక్షలకు హాజరై ఇంటరŠూయ్వ వరకు వెళ్లినా తృటిలో ర్యాంకు మిస్‌ అయ్యింది. 2021 అక్టోబర్‌లో పరీక్ష రాయగా 235వ ర్యాంక్‌ లభించింది. మణిదీప్‌ మాట్లాడుతూ.. ‘తొలిసారి దారుణంగా ఓటమి చెందినా నిరాశ చెందకుండా కొంతకాలం చెన్నైలో శిక్షణ పొందాను. కరోనా దగ్గర్నుంచి ఇంటివద్దే సాధన చేస్తున్నాను. ఆన్‌లైన్‌ టెస్ట్‌లు రాసేవాడిని, నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవడం, ఆంగ్ల, తెలుగు పత్రికలు చదవడం చేసేవాడిని’ అని చెప్పారు. అశ్విన్‌ మణిదీప్‌తో సాక్షి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

Photo Stories