Skip to main content

Inspire Success Story : ఇత‌ను సామాన్యూడు కాదు.. 1 కాదు.. 2 కాదు.. ఏకంగా 8 గ‌వ‌ర్నమెంట్ ఉద్యోగాల‌ను కొట్టాడిలా...

కోచింగ్ తీసుకున్న ఉద్యోగం కొట్టాలంటే.. క‌ష్ట‌మౌతున్న ఈ రోజుల్లో ఈ యువ‌కుడు ఎలాంటి కోచింగ్ లేకుండానే ఏకంగా వ‌రుస‌గా 8 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను కొట్టి.. అంద‌రిని ఆశ్చ‌ర్యపోయేలా చేశాడు.
Rajesh Success Story

ఇత‌నే తెలంగాణ‌లోని వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన రాయరాకుల రాజేశ్. ఈ నేప‌థ్యంలో రాజేశ్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

ఎలాంటి కోచింగ్ లేకుండా ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టిన ఈ యువకుడు.., అన్న బాటలోనే తమ్ముడు కూడా... శభాష్ అంటున్న గ్రామస్తులు. వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన రాయరాకుల రాజేశ్ అనే యువకుడు కోచింగ్ లేకుండానే ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు. 

➤☛ Nikitha Success Story : ఒకేసారి 6 గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ నా ల‌క్ష్యం మాత్రం ఇదే..!

వ‌రుస‌గా వ‌చ్చిన ఉద్యోగాలు ఇవే..
పంచాయితీ సెక్రటరీ, PGT గురుకుల, ASO, TGT గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2, గ్రూప్-4, DSC, JL ఇలా వ‌రుస‌గా 8 ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం మల్లంపల్లిలో PGTగా పనిచేస్తున్నాడు. 

అన్నదమ్ములు ఇద్దరిపై..
ఇతని తమ్ముడు సంతోష్ కూడా అన్న స్ఫూర్తిగా గ్రూప్-4 సాధించి, గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. అన్నదమ్ములు ఇద్దరిపై గ్రామస్తులు ప్రశంసలు కురిసిస్తున్నారు.

Published date : 15 Nov 2024 08:41PM

Photo Stories