Skip to main content

Nikitha Success Story : ఒకేసారి 6 గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ నా ల‌క్ష్యం మాత్రం ఇదే..!

ప్ర‌స్తుత పోటీరంగంలో ఒక్క ఉద్యోగం కొట్టాలంటేనే గ‌గ‌నం అవుతుంది. కానీ యువ‌తి మాత్రం ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనేలా చేసింది.
Nikitha Success Story

ఈమె తెలంగాణ‌లోని ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలోని చిన్న బుగ్గారం చిన్న పల్లెకు చెందిన నిఖిత. ఈ నేప‌థ్యంలో నిఖిత స‌క్సెస్ స్టోరీ మీకోసం...

అరకొర సౌక‌ర్యాల‌తో.. 
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుక బడిన జిల్లాల్లో ఆదిలాబాద్‌ ఒకటి. ఈ జిల్లాలో చాలా ప్రాంతాలకు ఇప్పటికీ రవాణా సౌకర్యం లేదు. సరైన వైద్య, నీటి, రోడ్డు సదుపాయాలు లేవు. ఇక చదువు విషయాని కొస్తే.. ఇక్కడి చాలా గ్రామాల్లో స్కూల్స్‌ లేవు. ఒకవేళ ఉన్నా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే ఉన్నాయి. ఇలా అరకొర సదుపాయాలున్న ఈ జిల్లాల్లో ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగమంటేనే అందని ద్రాక్షలా ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఈ జిల్లాల్లో పలువురు సర్కార్ కొలువులు సొంతం చేసుకుంటున్నారు. 

➤☛ DSC Ranker Inspirational Success Story : టీ అమ్మూతూ..రూ.5 భోజనం తింటూ.. ఒకేసారి 5 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించానిలా.. కానీ..

వీరిని ప్రేరణగా తీసుకోని..
గ్రామానికి చెందిన ప్రతాప్‌సింగ్‌, శ్రావణ్‌కుమార్‌ అప్పటి జిల్లా సెలెక్షన్‌ కమిటీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక కావటం ఆ పల్లెని ఓ మలుపుతిప్పింది. వారిని ప్రేరణగా తీసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని పట్టుబట్టారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారి సంఖ్య అక్షరాలా 82 మందికి చేరింది. వీరంతా రెవెన్యూ, పోలీసు, విద్య, వైద్యం వంటి వివిధ శాఖల్లో ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు.

☛ IAS Officer Success Story : ఇందుకే క‌లెక్ట‌ర్ ఉద్యోగానికి రాజీనామా చేశా..

రాష్ట్రస్థాయిలోనే..
ఈ ఏడాది జరిగిన వివిధ‌ ప్రభుత్వ ఉద్యోగ‌ నియామకాల్లో ఆదిలాబాద్ జిల్లా తండాకు చెందిన నిఖిత ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించింది. గురుకుల డీఎల్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకర్‌గా నిలిచింది ఈ యువతి. 

☛ Inspiring Success Story : బిచ్చగాళ్లతో రోడ్డుపై పడుకున్నా.. ఇంట‌ర్‌లో అన్ని సబ్జెక్ట్ లు ఫెయిల్.. ఈ క‌సితోనే నేడు ఐపీఎస్ అయ్యానిలా..

నిఖితకు చిన్నప్పటి నుంచి..
అలాగే చిన్నబుగ్గారానికి చెందిన నిఖితకు చిన్నప్పటి నుంచి టీచింగ్ అంటే మహా ఇష్టం. ఎప్పటికైనా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనేది ఆమె లక్ష్యం. దీంతో ప్రయత్నాలు ప్రారంభించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏడాది వ్యవధిలోనే ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. 

☛ IAS Achievement : ఎటువంటి శిక్ష‌ణ లేకుండానే.. రెండో ప్ర‌య‌త్నంలోనే ఐఏఎస్ కొట్టానిలా..

వ‌చ్చిన ఉద్యోగాలు ఇవే..
గతేడాది 2023 సెప్టెంబర్‌ నుంచి 2024 ఆగస్టు వరకు జరిగిన పలు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమై పరీక్షలు రాసింది. రోజుకి 7 నుంచి 10 గంటల వరకు క‌ష్టపడి చదివి అనుకున్నది సాధించింది. మొదట సోషల్ వెల్ఫేర్‌లో పీజీటీగా, ఆ తర్వాత టీజీటీ అనంతరం.. జేఎల్, డీఎల్, గ్రూప్ 4 పోస్టులకు వరుసగా ఎంపికైంది. తాజాగా టీఎస్పీఎస్సీ నిర్వహించిన జేఎల్‌ పరీక్షలోనూ సత్తా చాటింది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే పేదరికం అడ్డు కాదని నిఖిత నిరూపించింది. నేడు పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు నిఖిత స‌క్సెస్ జ‌ర్నీ... స్ఫూర్తినిస్తుంది.

☛➤ Women IAS Success Story : ఫెయిల్ అవుతునే ఉన్నా.. కానీ ప్ర‌య‌త్నాన్ని మాత్రం ఆప‌లేదు.. చివ‌రికి ఐఏఎస్ కొట్టానిలా..

Published date : 15 Nov 2024 04:18PM

Photo Stories