Skip to main content

IAS Officer Success Story : ఇందుకే క‌లెక్ట‌ర్ ఉద్యోగానికి రాజీనామా చేశా..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(UPSC) నిర్వ‌హించే సివిల్స్ ప‌రీక్ష‌లు దేశంలో అత్యంత క‌ఠిన‌మైన ప‌రీక్ష‌ల్లో ఇది ఒక‌టి. ఎంతో క‌ఠిన ప్రిప‌రేష‌న్ ఉంటే కానీ.. ఇందులో విజ‌యం సాధించ‌లేరు. కానీ లక్షల మందిలో అతికొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది.
paparao biyyala ias success story in telugu

ఇలాంటి క‌ష్ట‌మైన ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించి.. ఐఏఎస్ ఉద్యోగం కొట్టాడు ఈయ‌న‌. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా ఎంతో కష్టపడి ఐఏఎస్‌ ఉద్యోగం కొట్టాడు. తనకు పోస్టింగ్‌ వేసిన చోట సమర్థవంతంగా పని చేసి శెభాష్‌ అనిపించుకున్నాడు. కానీ కొన్నేళ్లకు తానే రాజీనామా చేశారు. ఈయ‌నే పాపారావు బియ్యాల. ఈ నేప‌థ్యంలో పాపారావు బియ్యాల ఐఏఎస్ ఉద్యోగంకు ఎందుకు రాజీనామా చేశాడు.. ఈయ‌న ల‌క్ష్యం ఏమిటి..? స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

☛ 22 ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికై..రెండేళ్లకే ఉద్యోగానికి రాజీనామా..ఆ త‌ర్వాత ఉచితంగా

కుటుంబ నేప‌థ్యం :
పాపారావు బియ్యాల.. తెలంగాణ‌లోని వరంగల్‌లో 1954వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన తండ్రి కిషన్‌ రావు స్వాతంత్య్ర సమరయోధుడు, తల్లి అనసూయా దేవి గృహిణి. 

ఎడ్యుకేష‌న్ : 

paparao ias success

వరంగల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన పాపారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నాడు. పీహెచ్‌డీ కోసం న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేరాడు. ఆ త‌ర్వాత యూపీఎస్సీ సివిల్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిప‌రేష‌న్ అయ్యారు. ఈ సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మంచి ర్యాంక్ సాధించి.. ఐఏఎస్ ఉద్యోగానికి ఎంపిక‌య్యారు. ఐఏఎస్ ఉద్యోగం రావడంతో.. పీహెచ్‌డీ మధ్యలోనే ఆపేశాడు. 1982లో ఐఏఎస్‌ సాధించిన ఇతడు కీలక హోదాల్లో విధులు నిర్వహించాడు.

☛ Sirisha, SI : న‌న్ను ఆఫ్‌ట్రాల్ కానిస్టేబుల్ అన్న ఆ ఎస్పీతోనే..

దాదాపు 500 కుటుంబాలకు..

paparao biyyala ias inspire story in telugu

అస్సాంలోని జోర్హాట్‌ జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా, తర్వాత ఆ రాష్ట్ర హోం సెక్రటరీగా సేవలందించాడు. జోర్హాట్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నప్పుడు తీవ్రవాదులకు వ్యతిరేకంగా జిల్లాస్థాయిలో పోలీసు, సైనిక బలగాలను సమన్వయం చేశాడు. 1992లో నదీకోత వల్ల ఇళ్లు కొట్టుకుపోయిన దాదాపు 500 కుటుంబాలకు కొత్త గ్రామాన్ని సృష్టించేందుకు సాయపడ్డాడు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఐదేళ్లపాటు పనిచేశాడు. డ్రగ్స్‌ రహిత క్రీడలను ప్రోత్సహించడం కోసం 'క్లీన్‌ స్పోర్ట్స్‌ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థనూ ఏర్పాటు చేశాడు. ఉన్నట్లుండి 2005లో ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేశాడు.

Nagalakshmi: కూలి పనులు చేస్తూ..చదివా..నా జీవితాన్ని మార్చింది ఇదే..

జాతీయ అవార్డులు..

paparao biyyala ias news telugu

ఆ తర్వాత 2014-19వరకు తెలంగాణ ప్రభుత్వానికి పాలసీ అడ్వైజర్‌గా కొనసాగాడు. అయితే ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడే 1996లో న్యూయార్క్‌ ఫిలిం అకాడమీలో 3 నెలల కోర్సు చేశాడు. 1998లో 'విల్లింగ్‌ టు సాక్రిఫైస్‌' అనే డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం తీశాడు. ఈ మూవీ 2000వ సంవత్సరంలో ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ సంతోషంతో వెంటనే సినిమాలు చేయలేదు. 

hiva Kumar goud, DSP: ఆ ఒకే ఒక్క‌ మార్కే..నా జీవితాన్ని మార్చిందిలా..

చాలా గ్యాప్‌ తీసుకుని ఈ ఏడాది మ్యూజిక్‌ స్కూల్‌ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. శ్రియ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మే 12న విడుదలవగా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మరి నెక్స్ట్‌ ఆయన ఎటువంటి సినిమాతో ముందుకు వస్తాడో చూడాలి.

Supraja,DSP : వీరిని లెక్కపెట్టకుండా చదివా..గ్రూప్-1 ఉద్యోగం కొట్టా..

Published date : 15 Nov 2023 02:59PM

Photo Stories