Skip to main content

Nagalakshmi: కూలి పనులు చేస్తూ..చదివా..నా జీవితాన్ని మార్చింది ఇదే..

దేశ వ్యాప్తంగా వివిధ హోదాల్లో స్థిరపడి పలువురికి ఆదర్శంగా నిలిచిన గిరిజన ముద్దుబిడ్డలను ఇటీవల మహిళా శిరోమణి అవార్డుతో ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ సన్మానించింది.
Nagalakshmi
Nagalakshmi

వీరిలో నాగలక్ష్మి ఒకరు. జిల్లా గర్వించదగిన మహిళల్లో ఒకరైన సన్మాన గ్రహీత నాగలక్ష్మి ఆదర్శ జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే..

కుటుంబ నేపథ్యం:
మాది అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అడదాకులపల్లి తండా. నాన్న రామానాయక్, తల్లి సక్కుబాయి. మేము ముగ్గురం సంతానం. అందరం ఆడపిల్లలమే. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో వ్యవసాయ కూలీలుగా అమ్మ, నాన్న కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు. కూలి పనులు లేనప్పుడు కొండలపైకి వెళ్లి చీపురు పుల్లలు తీసుకొచ్చి వాటిని కట్టకట్టి అమ్ముకుని జీవించేవాళ్లం. వారిలా మేము కష్టపడకూడదని అమ్మ, నాన్న భావించి.. మమ్మల్ని బాగా చదివించాలని అనుకున్నారు.

నాలుగిళ్లలో పాచిపనులు చేస్తూ...
అక్కడే ఉంటే ఆ పరిస్థితులు మమ్మల్ని కూలీలుగా ఎక్కడ మారుస్తాయోనని భయపడి అమ్మ మమ్మల్ని పిలుచుకుని ఒంటరిగా అనంతపురానికి చేరుకుంది. ఇక్కడ నాలుగిళ్లలో పాచిపనులు చేస్తూ జీవనం మొదలు పెట్టాం. ఆ తర్వాత ఇంటిలో గ్రైండర్ ఏర్పాటు చేసుకుని, అమ్మ స్వశక్తితో మమ్మల్ని చదివించసాగింది. మా ఉన్నతి కోసం అమ్మ పడిన కష్టం నేనెన్నటికీ మరువలేను.

కూలి పనులు చేశా...
మా అక్కచెల్లెళ్లలో నేనే పెద్దదాన్ని. మా అమ్మ కష్టమేమిటో చాలా దగ్గరగా చూసిన దాన్ని కూడా నేనే. ఇంటికి ఆసరాగా ఉంటుందని అమ్మతో పాటు కూలీ పనులకు నేను కూడా వెళ్లేదాన్ని. అరుుతే చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఏ మాత్రం తీరిక దొరికినా పుస్తకాలు ముందేసుకుని కూర్చొనేదాన్ని.అనంతపురానికి వచ్చేసిన తర్వాత ఇక్కడి తొలుత అశోక్‌నగర్‌లోని నీలి షికారీ పాఠశాలలో, తర్వాత గిల్డ్ ఆఫ్ సర్వీసు పాఠశాలల్లో 7వ తరగతి వరకు చదువుకున్నా. ఇల్లు జరగడం కష్టంగా ఉండడం గమనించి, మదనపల్లిలోని సీఎస్‌ఐ మిషనరీ వారు అక్కడి హాస్టల్‌లో సీటు ఇచ్చారు. అక్కడే ఉంటూ పదో తరగతి పూర్తి చేశాను. తిరిగి ఇంటర్, డిగ్రీ ఇక్కడే అనంతపురంలోనే పూర్తి చేశాను. ఎంఏ., ఎంఫిల్‌ను సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తి చేశా.

జీవిత గమ్యాన్ని మార్చింది ఇదే..
చిన్నప్పటి నుంచి తండాలో పెరగడం వల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు చూశా. నిరక్షరాస్యత, తాగుడు వల్ల ఎంతో మంది జీవితాలు నా కళ్ల ముందే నాశనమైపోతుంటే ఏడుపొచ్చేది. చిరుప్రాయంలోనే భర్తలను కోల్పోరుు వితంతువులుగా మారిన తోటి ఈడువారిని చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగేవి కావు. ఈ సమస్యలకు పరిష్కారం చదువు ఒక్కటేనని భావించా. అలా నాన్న ప్రోత్సాహం, అమ్మ కష్టంతో ఉన్నత చదువులు అభ్యసించగలిగాను. ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించే విషయంలో నా వరకు నా జీవితమే పెద్ద పాఠమైంది. అనుకోని విధంగా మా నాన్న చనిపోరుున తర్వాత నా చెల్లెళ్లు జీవితంలో స్థిరపడేలా చేయగలిగాను.

ఉద్యోగానికీ పోరాటమే..

నాగలక్ష్మి


ఉన్నత చదువులు ముగిసిన తర్వాత రెండేళ్ల పాటు మహిళా యూనివర్సిటీలో లెక్చరర్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాను. అక్కడే ఉంటే నేను నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువ కాలేనని అనుకున్నా. దీంతో గ్రూప్స్‌కు సిద్ధమయ్యా. తొలిసారే 2001 ఆఖరులో జిల్లా ఉపాధి కల్పనాధికారిగా అవకాశం వచ్చింది. అరుుతే ఓ ఓసీ అమ్మారుు అందజేసిన తప్పుడు సర్టిఫికెట్ కారణంగా ఆ ఉద్యోగం కాస్తా నాకు దక్కకుండా పోరుుంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రరుుంచాల్సి వచ్చింది. రెండేళ్ల పాటు విచారణ అనంతరం 2004లో నాకు అనుకూలంగా కోర్టు తీర్పునివ్వడంతో హైదరాబాద్‌లో ఉపాధి కల్పనాధికారిగా బాధ్యతలు తీసుకున్నా. అక్కడ ఓ రెన్నెల్ల పాటు పనిచేశా.

ఆ సమయంలోనే నేను...
నేను చేస్తున్న పని నాకు తృప్తినివ్వలేదు. ఆ సమయంలోనే గ్రూప్స్ పోటీ పరీక్షల్లో విజయం సాధించి, శ్రీకాకుళంలో ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరా. 2009లో ఇదే శాఖలో విజయనగరం సూపరింటెండెంట్‌గా పనిచేశాను. 2012 నుంచి శ్రీకాకుళం, కడప జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశాను. ఈ ఏడాది జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి పొందాను. నేను చెప్పేది ఒక్కటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని శ్రమిస్తే దాన్ని సులువుగా సాధించవచ్చు. ఇందుకు నేనే నిదర్శనం.

నా జీవితమే ఓ పాఠం..
చిన్నప్పటి నుంచి తండాలో పెరగడం వల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు చూశా. నిరక్షరాస్యత, తాగుడు వల్ల ఎంతో మంది జీవితాలు నా కళ్ల ముందే నాశనమైపోతుంటే ఏడుపొచ్చేది. చిరుప్రాయంలోనే భర్తను కోల్పోరుు వితంతువులుగా మారిన తోటి ఈడువారిని చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగేవి కావు. ఈ సమస్యలకు పరిష్కారం చదువు ఒక్కటేనని భావించా. అలా నాన్న ప్రోత్సాహం, అమ్మ కష్టంతో ఉన్నత చదువులు అభ్యసించగలిగాను. ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించే విషయంలో నా వరకు నా జీవితమే పెద్ద పాఠమైంది.

తండ్రి తాగుడికి బానిసై.. 
‘అందరూ బాగుండాలి... ఆ అందరిలో నేనూ ఉండాలి’ అనుకుంటే... అది ఒక మంచి ఆలోచన. ‘ఒకరితో నాకు పనేంటి.. నేను మాత్రమే బాగుండాలి’ అనుకుంటే... అది స్వార్థానికి పరాకాష్ట. ‘నేను బాగున్నాను.. నాతోపాటు సమాజం కూడా బాగుండాలి’ అనుకుంటే... అది ఉదాత్తమైన భావన, ఒక మంచికి పునాది. అలాంటి పునాది రాళ్లను వేసుకుంటూ వస్తున్నారు డిప్యూటీ కమీషనర్‌ నాగలక్ష్మి. తండ్రి తాగుడికి బానిసై ప్రాణాల మీదికి తెచ్చుకోవడంతో.. ఆయనపై ఉన్న ప్రేమ వల్ల.. సారా తయారీని అంతమొందించే బాధ్యతను తన ఉద్యోగ బాధ్యతలలో ఒక భాగంగా చేసుకున్నారు.

బాగా చదివించడానికి కుటుంబాన్ని..
‘‘మా అమ్మ పడిన కష్టాలు మరే మహిళకూ రాకూడదనుకున్నాను. అందుకే సారాకు వ్యతిరేకంగా గ్రామస్థులను చైతన్యవంతం చేస్తున్నాను’’ అన్నారు నాగలక్ష్మి. తండా నాగలక్ష్మి రమావత్‌ది అనంతపురం జిల్లా పెనుగొండ మండలం, అడదాకుల పల్లి తండా. తండ్రి రామానాయక్‌ ఒక ఎన్‌జీవోలో వాచ్‌మన్‌గా చేసేవారు. ఆ ఉద్యోగంలో ఆయన బాగా చదువుకున్న వాళ్లను, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్లను దగ్గరగా చూస్తుండటంతో వారి స్ఫూర్తితో తన కూతుళ్లకు కూడా పెద్ద ఉద్యోగాల్లో చేరి జిల్లా అధికారులు కావాలని చెప్పేవారు. పిల్లల్ని బాగా చదివించడానికి కుటుంబాన్ని అనంతపురం పట్టణానికి మార్చారాయన. కూతుళ్లు ముగ్గురినీ స్కూళ్లలో చేర్చారు. రామానాయక్‌ నిరక్షరాస్యుడు. అయినా సరే రోజూ తెల్లవారి ఐదు గంటలకు వెళ్లి పేపర్‌ కొనుక్కొచ్చేవాడు. కూతుళ్లు చదువుతుంటే వినేవాడు. సామాజిక, రాజకీయ పరిణామాలను సమగ్రంగా తెలుసుకునేవాడాయన. ఆయనలో ఎంత విజ్ఞత ఉన్నప్పటికీ మద్యం విషయంలో విచక్షణ లేకపోవడంతో తమ కుటుంబం తీవ్రమైన కష్టాలపాలయినట్లు చెప్పారు నాగలక్ష్మి. ఆయన తాగి తాగి యాభై ఏళ్ల లోపలే చనిపోయారు.

ఆ గంజి తాగితే రోజంతా..
శ్రీకాకుళం జిల్లాలో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా ఉద్యోగంలో చేరడం నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పిందనే చెప్పాలి. అక్కడ మారుమూల ప్రాంతాలకు రోడ్డు కూడా ఉండదు. అక్కడి వాళ్లకు నాగరిక సమాజంతో సంబంధాలు పెద్దగా ఉండవు. అక్కడి గిరిజనులకు బియ్యం కూడా ఉండవు. నూకల్లో తెల్ల గుళికల్లాంటి ఉండలను వేసి చిక్కటి గంజిలా కాచి, ఆ గంజిని పులవబెట్టి తాగుతారు. ఆ గంజి తాగితే రోజంతా మత్తుగా పడుంటారు. అందుకని అక్కడ ప్రతి శనివారం ఒక్కో గ్రామానికి వెళ్లి కుటుంబానికి ఐదు కేజీల బియ్యం, లీటరు నూనె, కేజీ చక్కెర పంపిణీ చేయడం మొదలుపెట్టాం. కర్నూలు జిల్లాలో పనిచేసిన రోజుల్లో పత్తికొండలో 24 తండాల్లో సారా వ్యతిరేక చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించాను. కొన్ని గ్రామాల్లో అందరి చేత ప్రతిజ్ఞ చేయించగలిగాం. మా వాళ్లు సారా బట్టీలను వెతికి పట్టుకుని పగలకొట్టేవాళ్లు. మరో టీమ్‌ గ్రామస్థులను సమావేశ పరిచి సారా తాగడంతో వచ్చే అనారోగ్యాలను వివరించేది.

మా అమ్మ, ఆమె అక్కచెల్లెళ్లు చిన్న వయసులోనే..

 ప్రతిజ్ఞ చేయిస్తున్న డిప్యూటీ కమిషనర్‌ నాగలక్ష్మి


మా టీమ్‌లో డాక్టర్‌ను కూడా తీసుకెళ్లి లివర్, కిడ్నీ పాడయిన వాళ్లను చూపించి మరీ వివరించేవాళ్లం. మేము అధికారాన్ని ప్రదర్శిస్తే వాళ్లు కూడా మొండిగా ఉండేవాళ్లేమో. నేను తండావాసులతో మా బంజారా భాషలో మాట్లాడతాను. మా నాన్న... సారాకు బానిసయ్యి ప్రాణాలు కోల్పోయిన సంగతి వాళ్లకు చెబుతాను. మా అమ్మ, ఆమె అక్కచెల్లెళ్లు చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. వయసులో ఉన్న మహిళకు భర్త తోడు లేకపోతే సమాజంలో ఎదురయ్యే వేధింపులను దగ్గరగా చూసినదాన్ని కావడంతో ఆ కష్టాలు మరే మహిళకూ రాకూడదని వాళ్లను వేడుకుంటాను. ఒక్క సమావేశంలోనే పూర్తిగా మారరు, ఆలోచనలో పడతారంతే. ఐదారుసార్లు కలిసిన తర్వాత ‘సారా తాగము– సారా కాయము’ అని ప్రతిజ్ఞ చేయిస్తాం. కౌన్సెలింగ్‌లతో దారికి రాని వాళ్ల విషయంలో స్ట్రిక్టుగానే ఉంటాం. సారా తయారు చేసేవాళ్లతోపాటు సారా తయారీకి భూమి ఇచ్చిన వాళ్ల మీద కూడా కేసులు పెడుతున్నాం.

నాయకుల నుంచి ఫోన్ కాల్స్‌..అయినా కూడా..
సారా బట్టీలను, తయారీని చూస్తే కడుపులో తిప్పినట్లవుతుంది. బెల్లం ఊటను మరిగించేటప్పుడు ఇంకా ఏంటేంటో పదార్థాలు వేస్తుంటారు. వాటితోపాటు కుంకుడుకాయలు, ఆకులు, పుల్లలు, పాములు, తేళ్లు, జెర్రులు, బల్లులు కూడా కలిసిపోతుంటాయి. వాటి విషం కూడా సారాలోకి దిగుతుంది. ప్రాణాల మీదకు వచ్చేది ఇలాంటి సారా తాగినప్పుడే. చిత్తూరు కార్వేటి నగరం సమీపంలో కొన్ని నాటుసారా బట్టీలున్నాయి. అక్కడి నుంచి తమిళనాడుకి నంబర్‌ ప్లేట్‌ లేని లారీలలో దొంగ సారా రవాణా అవుతుంటుంది. సారా రవాణా గురించిన సమాచారంతో ఆ ప్రదేశానికి వెళ్తుంటే దారిలో ఉండగానే ఫోన్‌ కాల్, వెనక్కి వచ్చేయమని ఆదేశం వచ్చేది.

ఐదేళ్లలో నాలుగు చోట్లకు బదిలీ..     
నాటుసారా బట్టీలపై దాడులు చేయడం, సారా తయారీని అరికట్టడం, నంబర్‌ లేని వాహనాన్ని వెంటనే సీజ్‌ చేయడం మా డ్యూటీ. మా డ్యూటీని మమ్మల్ని చేయనివ్వకపోతే మమ్మల్ని ఉద్యోగంలో ఎందుకు చేర్చుకున్నట్లు? గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగం చేయడమే కష్టంగా ఉండేది. ఐదేళ్లలో నాలుగు చోట్లకు బదిలీ అయ్యాను. ఇప్పుడు కొత్త ప్రభుత్వం సారా నిషేధం మీద చిత్తశుద్ధితో ఉండడంతో మాలాంటి వాళ్లకు ధైర్యం వచ్చింది. సారా కాయడం మీద ఉక్కు పాదం మోపితే సరిపోదు. సారా తాగకూడదనేటట్లు మనుషుల మనసులను మార్చాలి. వారిని చైతన్యవంతం చేయడం కోసమే ఎనిమిది పాటలు రాయించాం. వాటిని రికార్డ్‌ చేయిస్తున్నాం’’ అన్నారు నాగలక్ష్మి.

Published date : 02 Dec 2021 03:26PM

Photo Stories