AP SI Success Stories : ఈ కిక్ కోసమే.. ఎస్ఐ ఉద్యోగాలు కొట్టామిలా.. కానీ..
పోలీసు డ్రెస్ అంటే ఓ గౌరవం. అది ధరిస్తే వచ్చే ఒక హుందాతనం ఎంతో గొప్పగా ఉంటుంది. ఎంతో మంది యువత ఈ ఉద్యోగాలను సాధించడం కోసం ఎంతో కష్టపడుతుంటారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం సత్తిరెడ్డిపేటకు చెందిన కొరిపూరి సూర్యప్రకాష్, ప్రత్తిపాడు రూరల్ మండలం ధర్మవరానికి చెందిన రెడ్డిపల్లి శ్రీధర్ బాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామానికి చెందిన తిరుమాని లోకేశ్వరి, రామాడి కవిత, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లికి చెందిన కుంచే శ్రీలత ఈ ఘనత సాధించి అందరి అభినందనలు పొందారు.
సూర్యప్రకాష్ 2018లో ఇంజినీరింగ్ పూర్తి చేసినా ఎస్సై ఉద్యోగంపై ఇష్టంతో కష్టపడి ఈ ఘనత సాధించాడు. అతని తండ్రి శ్రీను గోకవరం ఆర్టీసీ డిపోలో కండక్టర్ కాగా, తల్లి సత్యవతి గృహిణి. అక్టోబర్ 14, 15 తేదీల్లో నిర్వహించిన ఎస్‌ఐ పరీక్షల్లో ఎంపికయ్యాడు.
అలాగే శ్రీధర్ బాబు వ్యవసాయ నేపథ్యం కలిగిన రెడ్డిపల్లి సత్యనారాయణ, రాఘవమ్మ దంపతుల కుమారుడు. ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన ఆయన తొలుత 2013లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించి అమలాపురంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎస్సై పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యారు.
ఇక లోకేశ్వరి తిరుమాని సత్యానందం కుమార్తె. 7వ తరగతి వరకు ఎంపీపీయూపీ బలుసుతిప్ప, 8 నుంచి పదో తరగతి వరకు కందికుప్ప హైస్కూళ్లలో చదువుకుంది. తన కుటుంబ ఆర్థిక స్థోమత బాగులేకపోవడంతో మేనత్త కాలాడి వీరవేణి ఇంటి వద్ద ఉంటూ కాకినాడలో గాయత్రి జూనియర్ కాలేజిలో ఇంటర్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదివింది. శ్యామ్ ఇన్టిట్యూట్‌లో శిక్షణ పొంది మొదటి బ్యాచ్‌లోనే ఎస్సైగా ఎంపికైంది. ఈ విజయం తన అత్తమ్మకే అంకితమని ఆమె గర్వంగా చెప్పారు.
☛ AP SI Job Selected Candidates: ఖాకీ స్టార్స్.. ఎస్ఐలుగా ఎంపికైన కానిస్టేబుళ్లు.. వీరే..!
ఇదే గ్రామానికి చెందిన కవిత రామాడి కోటేశ్వరరావు, లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె. తండ్రి 1996 తుఫానులో మృతి చెందగా పిల్లలతో పాటు తల్లి కాకినాడ వెళ్లిపోయారు. కవిత భర్త కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో కానిస్టేబుల్. ఆమె పదో తరగతి వరకు సెయింట్ అన్స్ స్కూల్, ఇంటర్ నారాయణ జూనియర్ కళాశాల, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. అలాగే శ్రీలత ఎన్.కొత్తపల్లి సర్పంచ్ కుంచే చిట్టికుమారి, చిన్ని దంపతుల కుమార్తె. ఆమె స్థానిక సచివాలయం–2 పరిధిలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరందరి విజయాలపై ఆయా గ్రామాల్లో అభినందనలు వెల్లువెత్తాయి.
Tags
- ap si success stories
- ap si success story in telugu
- ap si real success stories
- ap si real life success story
- Inspire
- real life success story
- motivational story in telugu
- Real Life
- AP Police
- ap si success stories in telugu
- ap police success story in telugu
- Andhra Pradesh State Police
- APPoliceRecruitment
- SIExams
- Results
- EastGodavari
- YouthAchievement
- JobSuccess
- RecruitmentBoard
- andhrapradesh
- TopPerformers
- SuccessStory
- sakshi education success story