Inspirational Success Story : మా అమ్మ రోజువారీ కూలీ.. నాకు వచ్చిన ఈ ఐడియాతో లక్షలు సంపాదిస్తున్నా.. కానీ..
బురదలోంచి కమలం వికసించినట్లుగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. అయితే ఈ విజయం అంత సులభంగా రాదు. అలాంటి వారే చరిత్రలో నిలిచి పోతారు. అలాంటి స్ఫూర్తి దాయకమైన స్టోరీ ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చిన్న పట్టణానికి చెందిన..
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన సంతోష్ వసునియా.. పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగింది. మధ్యప్రదేశ్‌లోని ఝబువా అనే చిన్న పట్టణానికి చెందిన మహిళ సంతోష్. కరోనా సంక్షోభం కాలంలో పట్టణాల్లో ఉపాధి కోల్పోయి, అనేకమంది వలస కార్మికులు పల్లెబాట పట్టారు. పిల్లా పాపలతో వేలాది కిలోమీటర్లు, కిలీమీటర్లు నడకదారిలో తమ సొంత ఊరికి చేరుకున్న దృశ్యాలు ఇప్పటికీ మన కళ్లముందు ఉంటాయి. అలాంటి కుటుంబాల్లో సంతష్‌ది కూడా ఒకటి. సరిగ్గా ఆ సమయంలోనే వసునియా ధైర్యంగా ముందడుగు వేసింది. సొంతంగా తన కాళ్లమీద తాను నిలబడాలనే తన కల సాకారం కోసం అడుగులు వేసింది.
☛ Success Story: కూలీ పనులు చేస్తూ చదివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..
కేవలం లక్ష రూపాయలతో..
ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. కుటుంబంలో ఎలాంటి వ్యాపార వారసత్వం లేక పోయినా సొంత సౌందర్య ఉత్పత్తుల వ్యాపారం మదిలో మెదిలింది. కానీ తన దగ్గర ఉన్నది కేవలం లక్ష రూపాయలు మాత్రమే. ఇక్కడే తన ఆలోచనకు పదునుబెట్టింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం గురించి తెలుసుకుంది. స్వశక్తితో నిలబడాలనుకునే నిరుద్యోగులకు లక్ష నుంచి 50 లక్షల రూపాయల వరకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పీఎంఈజీపీ స్కీమ్ ద్వారా రూ.3.75 లక్షలు సాయాన్ని పొందింది. రిఫ్రెష్‌మెంట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ బిజినెస్‌లో సత్తా చాటుకుంటోంది. పలువురు గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.
మా అమ్మ రోజువారీ కూలీగా..
నాలుగేళ్ల వయసులోనే నాన్న చనిపోయారు. చదివింది పదవ తరగతే. అమ్మ రోజువారీ కూలీగా పని చేసేది. అమ్మ కష్టాలు చూశాను. చిన్నపుడే పెళ్లి. పెళ్లి, పిల్లల తరువాత 44 ఏళ్ల వయసులో వ్యాపారంలో నిర్ణయం తీసుకోవడమే కాదు, చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను. విజయం సాధించాను. అదృష్టవశాత్తూ, ట్రాన్స్‌ఫార్మ్ రూరల్ ఇండియా (TRI) ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెసిలిటేషన్ హబ్ వారు సాయం చేశారు అంటారు సంతోష్ వసునియా సంతోషంగా. నేటి మహిళలకు ఈ జీవిత ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకం.
Tags
- Santosh Vasuniya
- Santosh Vasuniya Inspire Story in Telugu
- Santosh Vasuniya Women Entrepreneurs
- Santosh Vasuniya Women Entrepreneurs Story in Telugu
- Santosh Vasuniya Real Life Stroy
- Santosh Vasuniya Inspire Story
- Santosh Vasuniya Motivational Story
- women's day inspiring stories in telugu
- santosh vasuniya business idea
- top 10 business ideas in telugu
- santosh vasuniya real life story in telugu
- inspirational story
- women empowerment stories