Santosh Lakshmi: ‘నాడు సర్పంచ్.. నేడు న్యాయమూర్తి’.. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన మహిళ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన కర్రి సంతోషలక్ష్మి న్యాయమూర్తిగా ఎంపికయ్యింది.
సంతోషలక్ష్మి ఇంత వరకు సర్పంచ్‌గా కూడా సేవలు అందించారు. ఆ తర్వాత న్యాయ శాస్త్రం చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే న్యాయమూర్తి కావాలన్న ఆశయంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఇటీవల విడుదల అయిన జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష ఫలితాల్లో విజయం సాధించి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.
దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భర్త దువ్వాడ వెంకటకుమార్ చౌదరి ప్రోత్సాహంతో ఆమె విజయం సాధించారు. ఆమె న్యాయమూర్తిగా ఎంపిక కావడంపై అంబేడ్కర్ యూనివర్సిటీ పూర్వ వీసీ హనుమంతు లజపతిరాయ్, రాజ్యలక్ష్మి, పీఎసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు తదితరులు అభినందనలు తెలిపారు.
SP Chandana Deepti Success Story : నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి సక్సెస్ స్టోరీ.. ఎన్నో సంచలన కేసుల్లో..
Published date : 07 Feb 2024 09:48AM