Skip to main content

AP SI Job Selected Candidates: ఖాకీ స్టార్స్‌.. ఎస్ఐలుగా ఎంపికైన కానిస్టేబుళ్లు.. వీరే..!

ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు ఎస్సైలుగా ఎంపికయ్యారు.
Prakasam District Police Constable Select SI Jobs  success story

సివిల్‌, స్పెషల్‌ పార్టీ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తూనే ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని కలల కొలువు సాధించారు. గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపిక ప్రక్రియ ఇటీవల పూర్తి కాగా ఇటీవ‌ల తుది ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జోన్‌–3లోని గుంటూరు రేంజ్‌ పరిధిలో 55 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అందులో జిల్లాకు చెందిన సివిల్‌ కానిస్టేబుళ్లు నలుగురు, ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఒకరు ఎస్ఐలుగా ఎంపికయ్యారు. వీరిని పోలీసు ఉన్నతాధికారులు, బంధుమిత్రులు అభినందించారు.

గిద్దలూరు మండలం రాజుపేట గ్రామానికి చెందిన జి.రాజశేఖర్‌ జిల్లా స్పెషల్‌ పార్టీ పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. 2016 నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికై 2018లో ఉద్యోగంలో చేరారు. స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌గా జిల్లాలో వివిధ పోలీస్‌ సబ్‌ డివిజన్లలో పనిచేశారు. ప్రస్తుతం సివిల్‌ విభాగంలో ఎస్ఐగా ఎంపికయ్యారు.

నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన ఎన్‌.అలేఖ్య ప్రస్తుతం కొత్తపట్నం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. 2014లో బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేసిన అలేఖ్య 2013 బ్యాచ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. గతంలో ఒంగోలు తాలూకా, ఒన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. అలేఖ్య భర్త రామరాజు కూడా కానిస్టేబుల్‌గా ఒంగోలు ఒన్‌టౌన్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. అలేఖ్య సివిల్‌ ఎస్ఐగా ఎంపికయ్యారు.

AP SI Job Selected Candidates: కష్టపడ్డారు.. కొలువు సాధించారు.. ఖాకీ చొక్కా ధరించి, తలపై టోపీ పెట్టుకుని, చేతిలో లాఠీ పట్టుకోనున్నారు..

దర్శి పట్టణానికి చెందిన పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి డిగ్రీ చదువుతూనే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. 2014లో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేసిన వెంకటేశ్వరరెడ్డి.. 2013లోనే పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగం వరించింది. స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌గా ప్రస్తుతం మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్ఐ పరీక్షలో 6వ ర్యాంకు సాధించిన వెంకటేశ్వరరెడ్డి సివిల్‌ విభాగంలో ఎస్ఐగా ఎంపికయ్యారు.

ద‌ర్శి ప‌ట్ట‌ణానికి చెందిన ఎస్‌కే సిరాజ్ ప్ర‌స్తుతం స్పెష‌ల్ పార్టీ కానిస్టేబుల్‌గా ఒంగోలులో ప‌నిచేస్తున్నారు. 2017లో బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేసిన సిరాజ్ 2018లో పోలీస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికై 2020లో విదుల్లో చేరారు. ఇటీవ‌ల వ్య‌వ‌హ‌రించిన ఎస్ఐ పరీక్ష ఫ‌లితాల్లో 32వ ర్యాంక్ సాధించిన ఆయ‌న ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ విభాగంలో ఎస్ఐగా ఎంపిక‌య్యారు.   

పామూరుకు చెందిన న‌స్రీన్ 2018లో సివిల్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా ఎంపిక‌య్యారు. ఆమె ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక పోలీస్ విభాగంలో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ప్ర‌స్తుతం న‌స్రీన్ సివిల్ విభాగంలో ఎస్ఐగా ఎంపికయ్యారు.

▶ ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించారు.. ఎస్‌ఐ ఫ‌లితాల్లో విజ‌యం సాధించారు.. వారు వీరే..

Published date : 25 Dec 2023 06:08PM

Photo Stories