Skip to main content

Breaking News: ఆంధ్రప్రదేశ్‌లో 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన తాజా సమాచారం

Andhra Pradesh Police Recruitment Chairman Ravi Prakash announcement   Breaking News: ఆంధ్రప్రదేశ్‌లో 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన తాజా సమాచారం

ఆంధ్రప్రదేశ్‌లో 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (PET) మరియు ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌ (PMT) పరీక్షలు జనవరి 30, 2025న ముగిశాయి. ఈ పరీక్షలకు 69,000 మంది హాజరుకాగా, 39,000 మంది అర్హత సాధించారు. అర్హత పొందిన అభ్యర్థులకు తుది రాత పరీక్షలను మార్చి చివరి వారం లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ రవి ప్రకాశ్‌ తెలిపారు.

హోంగార్డుల రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పును అనుసరించి చర్యలు తీసుకుంటామని, ఈ పోస్టులకు 2023 ఫిబ్రవరిలో 4.90 లక్షల మంది ప్రాథమిక పరీక్ష రాశారని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలు పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్ సైట్ slprb.ap.gov.in లో పొందుపరుస్తామన్నారు. 

ఇదీ చదవండి: TGPSC Groups 1, 2, 3 Results Date 2025 

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 31 Jan 2025 10:21AM

Photo Stories