Skip to main content

Inspirational Person: 82 ఏళ్ల వ‌య‌సులో సైకిల్‌ మెకానిక్‌కు పద్మశ్రీ... ఎందుకు ఇచ్చారో మీకు తెలుసా..?

ప్ర‌స్తుతం మ‌న‌దేశ జ‌నాభా సుమారు 140 కోట్లు. ఇంత మంది జ‌నాభాలో ప్ర‌తీ రోజూ కొన్ని వేల‌మంది త‌నువు చాలిస్తుంటారు. వీరిలో అనాథ‌లు, అభాగ్యులూ ఉంటారు. ఇలాంటి వారు బ‌తుకున్న‌ప్పుడే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఇక మ‌ర‌ణిస్తే.... మున్సిప‌ల్ సిబ్బందే ద‌హ‌న సంస్కారాలు చేస్తుంటారు.
Mohammed Sharif
Mohammed Sharif

అలా నిరాదరణకు గురైన ఎంతో మంది అనాథ శవాలకు ఆసరాగా నిలుస్తున్నారు 84 ఏళ్ల షరీఫ్‌ చాచా. 27 ఏళ్లలో 25 వేల మంది అభాగ్యులకు దహనసంస్కారాలు నిర్వహించి వారికి మరణంలోనూ గౌరవాన్ని ప్రసాదించారు. అంతటి గొప్ప మనుసున్న చాచాని గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన నిస్వార్థ సేవకు సముచిత గౌరవం కల్పించింది. ఆయ‌న గురించి ఇక్క‌డ తెలుసుకుందాం..!

ఒక‌టి త‌ర్వాత ఒక‌టి... ఆరు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన హైద‌రాబాదీ కుర్రాడు... ఎలా సాధించాడంటే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ షరీఫ్‌ చాచా స్వస్థలం. పెద్దగా చదువుకోని చాచా సైకిల్‌ మెకానిక్‌గా స్థిరపడ్డారు. 28 ఏళ్ల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత చెలరేగిన మత ఘర్షణల్లో ఆయన పెద్ద కొడుకు దుర్మరణం పాలయ్యాడు. కానీ, ఆ విషయం నెల తర్వాత గానీ కుటుంబ సభ్యులకు తెలియలేదు. అప్పటికే పూర్తిగా కుళ్లిపోయి అనాథలా తన కుమారుని శవం రైలు పట్టాలపై పడి ఉండడాన్ని చూసి షరీఫ్‌ చలించిపోయారు. 

తన కన్న కొడుకుకి పట్టిన గతి ఇంకెవరికీ రాకూడదని నిర్ణ‌యించుకున్నాడు. ఎక్కడ గుర్తు తెలియని మృతదేహాలు కనిపించినా సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించాలనుకున్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా అభాగ్యుల శవాలకు అంత్యక్రియలు నిర్వహించడమే కర్తవ్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటి వరకు 25వేల అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. 

15 ఏళ్ల‌కే తండ్రిని కోల్పోయి... సైకిల్ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించి... 23 ఏళ్ల‌కే ఐఏఎస్ సాధించిన వరుణ్ భరన్వాల్ స‌క్సెస్ స్టోరీ

Mohammed Sharif

నిత్యం ఆస్పత్రులు, పోలీస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్చురీలను షరీఫ్‌ సంప్రదిస్తారు. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత 72 గంటల్లో ఎవరూ శవాన్ని తీసుకోవడానికి రాకపోతే తనకు అప్పగించాలని చెబుతారు. చాచా చేస్తున్న సేవను గుర్తించిన అక్క‌డి సిబ్బంది, అధికారులు ఆయనకు సహకరించేవారు.

హిందూ, ముస్లింతో సంబంధం లేకుండా ఎవ‌రి పద్ధ‌తుల‌లో వారికి ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హిస్తారు చాచా. ఆయన సేవల్ని గుర్తించి బాలీవుడ్‌ ప్రఖ్యాత నటుడు అమీర్ ఖాన్‌.. 2012లో తన సత్యమేవ జయతే కార్యక్రమానికి పిలిచి చాచాని ప్రపంచానికి పరిచయం చేశారు.

NEET 2023 Ranker Success Story : కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. నీట్ ర్యాంకు సాధించిన విభూ ఉపాధ్యాయ

Mohammed Sharif

తాను చేస్తున్న మెకానిక్‌ పనితో ఇళ్లు గడవడమే కష్టంగా ఉన్నా.. తన సేవకు మాత్రం ఏనాడూ స్వస్తి పలకలేదు. చాచా సేవ‌ల‌ను గుర్తించిన భార‌త ప్ర‌భుత్వం 2020లో 71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొహమ్మద్ షరీఫ్ కు ప్రతిష్టాత్మక పద్మశ్రీతో సత్కరించింది.

Ananth Narayanan success story: మింత్రా సీఈఓ ప‌ద‌విని వ‌దిలేసి... ఆరు నెలల్లోనే 10 వేల‌ కోట్ల బిజినెస్‌ను స్థాపించిన అనంత్ స‌క్సెస్ జ‌ర్నీ

82 ఏళ్ల వ‌య‌సులో ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకుని... తాను సంపాదించే డబ్బులతో పాటు ఇరుగుపొరుగు వారు ఇచ్చే విరాళాలతో తన నిస్వార్ధ సేవకు కొనసాగిస్తున్న షరీఫ్‌ చాచాకు సలాం చెప్పాల్సిందే..!

Published date : 23 Jun 2023 03:18PM

Photo Stories