Skip to main content

Ananth Narayanan success story: మింత్రా సీఈఓ ప‌ద‌విని వ‌దిలేసి... ఆరు నెలల్లోనే 10 వేల‌ కోట్ల బిజినెస్‌ను స్థాపించిన అనంత్ స‌క్సెస్ జ‌ర్నీ

ఏ కొంచెం టాలెంట్ ఉన్నా మ‌న‌వాళ్లు స్టార్ట‌ప్స్ వైపు అడుగులేస్తున్నారు. ఒక‌రి కింద ప‌నిచేయ‌డం కంటే మ‌న తెలివితేట‌ల‌తో సొంతంగా బిజినెస్ ప్రారంభిద్దామ‌నుకునే వారి సంఖ్య నేడు ఎక్కువైపోయింది. అప్ప‌టికే దిగ్గ‌జ కార్పొరేట్ కంపెనీల‌లో ఉన్న‌త ప‌ద‌వుల్లో ప‌నిచేస్తూ, అత్య‌ధిక వేత‌నం తీసుకుంటున్నా ఎక్క‌డో తెలియ‌ని అసంత`ప్తి వారిని క‌మ్మేస్తోంది.
Ananth Narayanan
Ananth Narayanan

దీంతో ఆ కొలువుల‌కు రాజీనామా చేసి సొంతంగా ఎదుగుతున్నారు. అలాంటి వారిలో ఒక‌రే అనంత్ నారాయ‌ణ్‌. స్టార్ట‌ప్ ప్రారంభించిన ఆరునెలల్లోనే దాన్ని 10 వేల కోట్ల క్ల‌బ్‌లో చేర్చాడు. అనంత్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం... 

☛➤☛ జీవితంలో ఓట‌మిని ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దు... వ‌రుస‌గా 35 సార్లు ఫెయిల్‌... చివ‌రికి ఐఏఎస్ సాధించానిలా

ప్ర‌ముఖ ఈకామ‌ర్స్ సంస్థ మింత్రా(Myntra) సీఈఓగా అనంత్ నారాయ‌ణ‌న్ అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఇండియాలో దుస్తులు, ఫ‌ర్ఫ్యూమ్స్‌కు మింత్రా పెట్టింది పేరు. మంచి కంపెనీ, మంచి జీతం... అంత‌కు మించి మంచి స్థానం. కానీ, అనంత్ మ‌న‌సులో ఏదో అల‌జ‌డి. సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి, ఎద‌గాల‌నే త‌ప‌న‌. ఇవ‌న్నీ క‌లిసి ఆయ‌న్ను ఓ స్టార్ట‌ప్‌కు శ్రీకారం చుట్టేలా చేశాయి. 

Ananth Narayanan

అప్ప‌టికే మింత్రా లాంటి ఈకామెర్స్‌లో ప‌నిచేసిన అనుభ‌వం ఉండ‌డంతో తాను కూడా అదేబాట‌లో న‌డ‌వాల‌నుకున్నాడు. మెన్సా బ్రాండ్స్‌(Mensa Brands) పేరుతో ఈ కామెర్స్ సంస్థ‌ను ప్రారంభించాడు. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి విజ‌`ంభిస్తున్న స‌మ‌యంలో అంటే 2021 మేలో అనంత్ దీన్ని స్థాపించారు. నెల రోజుల్లోనే 50 మిలియన్ డాలర్ల పెట్టుబ‌డుల‌ను సమీకరించాడు. అలా మెన్సా ప్రారంభమైన ఆరు నెలల్లోనే పెట్టుబ‌డులు 135 మిలియన్ డాలర్లకు చేరాయి. దీన్ని కంపెనీ వాల్యూ 1.2 బిలియ‌న్ల‌కు చేరుకుంది.

☛➤☛ ఫ‌స్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్‌.. రెండో ప్ర‌య‌త్నంలో 36 ల‌క్ష‌ల మందిని వెన‌క్కినెట్టి ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచిన రాజ‌స్థాన్ కుర్రాడు

Ananth Narayanan

ఒక కంపెనీ పెట్టి కేవ‌లం ఆరునెల‌ల్లోనే అది దాదాపు 1.2 బిలియ‌న్ డాల‌ర్ల(రూ.9,900 కోట్లు) వాల్యూకి చేరుకోవ‌డం ఇండియాలో ఇదే మొద‌టిసారి. అనంత్ విద్యాభ్యాసం మ‌ద్రాస్ యూనివ‌ర్సిటీ, అమెరికాలోని మిచిగాన్ యూనివ‌ర్సిటీల‌లో సాగింది. చ‌దువు పూర్త‌వ‌గానే ప్ర‌ముఖ బ‌హుళ జాతి సంస్థ మెకిన్సీ(McKinsey)లో ఉన్న‌త ప‌ద‌విలో కొలువుదీరాడు. త‌ర్వాత అక్క‌డి నుంచి మింత్రా సీఈఓగా చేరారు. 

Ananth Narayanan

☛➤☛ ఇది క‌దా స‌క్సెస్ అంటే... రోజుకు 1.6 ల‌క్ష‌లు.. ఏడాదికి 6 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన కుర్రాడు

త‌న‌ మెన్సా బ్రాండ్స్‌ను అమెరికా ఈ-కామర్స్ రంగంలోకి దింపారు అనంత్‌. చిన్న వ్యాపారుల ఉత్పత్తులను ఈ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా విక్రయించ‌డం మొద‌లు పెట్టారు. మెన్సా అనే పదానికి గ్రీకులో న‌క్ష‌త్రాల స‌మూహం అని అర్థం. డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ల క్లస్టర్‌ మోడల్‌గా మెన్సాను అనంత్‌ తీర్చి దిద్దారు.  డజనుకు పైగా బ్రాండ్‌లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని, అమెరికా ఈకామ‌ర్స్ రంగంలో దూసుకెళుతున్నాడు. 

Ananth Narayanan

మెన్సా బ్రాండ్స్ ఏడాదికి వంద శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ప్రారంభించిన ఆరు నెలల్లోనే బిలియన్‌ డాలర్లు, అంతకంటే ఎక్కువ విలువైన భారతీయ యునికార్న్‌ గ్రూపులో అత్యంత వేగంగా ప్రవేశించిన స్టార్టప్‌గా మెన్సా నిలిచింది. 

➤☛  మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి

Published date : 20 May 2023 06:27PM

Photo Stories