3 crore salary package: మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి
కేరళకు చెందిన యాసిర్ మహ్మద్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 2018లో బీటెక్ చేరాడు. కంప్యూటర్ సైన్స్‌లో 8.6 సీజీపీఏ తో ఉత్తీర్ణత సాధించాడు. బీటెక్ చివరి సంవత్సరంలో యూనివర్సిటీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. ఈ ఇంటర్వ్యూలకు టాప్ ఫార్చ్యూన్ కంపెనీలు హాజరయ్యాయి.
చదవండి: 65 లక్షల ప్యాకేజీతో అదరగొట్టిన ఎంబీఏ అమ్మాయి... అత్యధిక వేతనంతో రికార్డు
ఇందులో మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా, జూమ్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. అనేక రౌండ్ల ఇంటర్వ్యూలలో సత్తా చాటడంతో యాసిర్‌ను జర్మనీకి చెందిన కంపెనీ భారీ ప్యాకేజీని ఆఫర్ చేసింది.
Top 10 Highest paying Govt Jobs: అత్యధిక వేతనం ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే
అదే యూనివర్సిటీకి చెందిన బీటెక్ విద్యార్థి హరేక్రిష్ణ మహతో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలలో అదరగొట్టాడు. 60 లక్షల వార్షిక వేతనంతో కొలువు సంపాదించారు. బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ కంపెనీ హరేక్రిష్ణకు ఆఫర్ లెటర్ అందజేసింది.
88 Lakh salary package: అదరగొట్టిన వరంగల్ నిట్ విద్యార్థి.... 88 లక్షల ప్యాకేజీతో రికార్డు