88 Lakh salary package: అదరగొట్టిన వరంగల్ నిట్ విద్యార్థి.... 88 లక్షల ప్యాకేజీతో రికార్డు
హర్యాణా లోని ఫరీదాబాద్‌కు చెందిన ఆదిత్య సింగ్ ఈ ప్యాకేజ్ అందుకున్నాడు. ఆదిత్య నాన్న న్యాయవాది, తల్లి ఉపాధ్యాయురాలు. కష్టపడే తత్వమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని ఆదిత్య చెబుతున్నాడు. తన చిన్ననాటి నుంచి తన తల్లిదండ్రులు ఇలా చదువుకో, అది చదువుకో అని ఎప్పుడూ చెప్పలేదని, తన నిర్ణయాలను వారు ఎప్పుడూ గౌరవించేవారని చెప్పుకొచ్చాడు.
చదవండి: మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి
వరంగల్ నిట్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి ఆదిత్య సింగ్. చివరి ఏడాది నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో అతను ఈ భారీ ప్యాకేజీ పొందాడు. అతనికి ఈ భారీ ప్యాకేజీ ఊరికే అందలేదు. మొదట తనను రెండు కంపెనీలు రిజెక్ట్ చేశాయి. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా మూడో కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూకు అటెండై సక్సెస్ సాధించాడు.
కంప్యూటర్ సైన్స్ లో చేరిన మొదటి సంవత్సరం నుంచే కోడింగ్‌పై పట్టు సాధించడం మొదలు పెట్టినట్లు ఆదిత్య తెలిపాడు. మొదటి ఇంటర్వ్యూలో కోడింగ్ ఇన్‌టైంలో చేయలేకపోవడంతో తనను రిజెక్ట్ చేశారని చెప్పాడు. చివరిగా మూడో ఇంటర్వ్యూలో అదరగొట్టి చరిత్ర లిఖించాడు. ఈ ఏడాది నిట్‌లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఆదిత్య ప్యాకేజీనే రికార్డు. గత ఏడాది నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో ఓ విద్యార్థి రూ.62.5 లక్షల ప్యాకేజీని సొంతం చేసుకున్నాడు.
NEET UG Exam 2023 Question Paper With Key : ముగిసిన నీట్ ఎగ్జామ్.. కీ కోసం క్లిక్ చేయండి
నిట్‌లో దాదాపు వెయ్యి మందికి పైగా ఈ సారి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే అత్యధిక వేతనాలు మాత్రం కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థులకే దక్కాయి. కంప్యూటర్ సైన్స్ విభాగానికే చెందిన సుశీత్ రూ.75 లక్షలు, సుఫియాన్ రూ.62.75 లక్షలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అయితే ఈఈఈ విభాగానికి చెందిన సౌరవ్ అనే విద్యార్థి రూ.55 లక్షల ప్యాకేజీతో నాలుగో స్థానంలో నిలిచారు.
Top 10 Highest paying Govt Jobs: అత్యధిక వేతనం ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే