Skip to main content

NEET UG Exam 2023 Question Paper With Key : ముగిసిన నీట్ ఎగ్జామ్‌.. కీ కోసం క్లిక్ చేయండి

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ (NEET UG 2023) పరీక్ష ఆదివారం ప్ర‌శాంతంగా ముగిసింది. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంట‌ల వ‌ర‌కు కొనసాగింది. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజర‌య్యారు.
NEET UG Exam 2023 Question Paper with Key
NEET UG Exam 2023 Question Paper with Key

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 1.40 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు.

NEET UG Exam 2023 Question Paper & Key : ఆ ఒక్క రాష్ట్రంలో త‌ప్పించి.. ప్రారంభ‌మైన‌ నీట్... సాక్షిలో నీట్ పేప‌ర్‌తో పాటు కీ..!

ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే...
ఎంబీబీస్‌, బీడీఎస్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే నీట్‌లో మంచి మార్కులు సాధించిన వారికే సీట్లు ద‌క్కుతాయి. ప‌రీక్ష‌లో స‌త్తా చాటేందుకు విద్యార్థులు రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ‌తారు. అయితే ఈ సారి ప్ర‌శ్న‌ప‌త్రాన్ని ప‌రిశీలిస్తే కొంచెం ఈజీగా వ‌చ్చింద‌ని విద్యార్థులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే గ‌తేడాది నీట్ ప‌రీక్ష‌తో పోల్చి చూస్తే మాత్రం క‌ఠినంగా ఉంద‌ని స‌బ్జెక్ట్‌ నిపుణులు చెప్పారు. మొత్తం 200 మార్కుల‌కు ప‌రీక్ష జ‌రిగింది. నీట్ క‌ట్ ఆఫ్ మార్కులు, ర్యాంకుల‌ను త్వ‌ర‌లోనే నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

NEET UG Exam 2023: అయ్యో పాపం... నీట్ మిస్ అయిన తెలుగు విద్యార్థి.. 5 నిమిషాలు ఆల‌స్య‌మ‌వ‌డంతో నో ఎంట్రీ..!

కీ ఇలా... 
నీట్ ప‌రీక్ష ముగిసింది. ఏ ప్ర‌శ్న‌కు జ‌వాబు ఏంటో తెలుసుకునేందుకు విద్యార్థులు త‌హ‌త‌హ‌లాడుతుంటారు. కీని స‌రిచూసుకుని త‌మ‌కు ఎన్ని మార్కులు వ‌చ్చే అవ‌కాశం ఉందో తెలుసుకుని సంబ‌ర‌ప‌డ‌తారు. వీరి కోసం సాక్షి నీట్ కీని అంద‌జేస్తోంది. స‌బ్జెక్ట్ నిపుణుల‌తో కీని త‌యారు చేయించింది. అయితే ఈ కీని విద్యార్థులు అవ‌గాహ‌న కోసమే తీసుకోవాలి. అంతిమంగా ఎన్‌టీఏ విడుద‌లచేసే కీ నే అధికారికంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Published date : 07 May 2023 09:31PM
PDF

Photo Stories