Ponnam Prabhakar: బీసీ గురుకుల సొసైటీలో కొత్తగా 8 సీఓఈలు
అక్టోబర్ 28న సచివాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇతర గురుకుల సొసైటీలతో పోలిస్తే బీసీ సొసైటీలో ఎక్కువ సంఖ్యలో పాఠశా లలున్నప్పటికీ కేవలం 2 సీఓఈలు మాత్రమే ఉన్నాయి. దీంతో వీటి సంఖ్య పెంపు అనివార్యం కావడంతో ప్రస్తుతానికి 8 సీఓఈల ఏర్పాటుకు బోర్డు నిర్ణయం తీసుకుంది.
చదవండి: TGPSC Group 1 Jobs: ఈ రెండు కేటగిరీల్లో తీవ్ర పోటీ!.. ఒక్కో పోస్టుకు ఇంత మంది పోటీ!
అదేవిధంగా ఈ సీఓఈల్లో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, నీట్‌లో ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించేలా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న రెండు స్కూల్ డ్రెస్సులు, ఒక స్పోర్ట్స్ డ్రెస్‌తో పాటుగా రెండు నైట్ డ్రెస్సులు కూడా ఇవ్వాలని, 90 ప్రాంతాలలో ఉన్న 104 గురుకుల పాఠశాలల్లో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ప్రతి గురుకుల విద్యాసంస్థలో సోలార్ వాటర్ హీటర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యా ర్థుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పరిశుభ్రమైన కిచెన్‌తోపాటుగా స్కూల్ ఆవరణలో శుభ్రత పాటించాలని మంత్రి పొన్నం అధికారులకు సూచన చేశారు.