NEET UG Exam 2023: అయ్యో పాపం... నీట్ మిస్ అయిన తెలుగు విద్యార్థి.. 5 నిమిషాలు ఆలస్యమవడంతో నో ఎంట్రీ..!
Sakshi Education
దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష ప్రారంభమైంది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దాదాపు 18 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో నీట్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు పరీక్ష జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 40 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్,. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలో తప్పించి.. ప్రారంభమైన నీట్... సాక్షిలో నీట్ పేపర్‌తో పాటు కీ..!
విద్యార్థికి నో ఎంట్రీ..
హైదరాబాద్ నగరం.. కేపీహెచ్‌బీలోని పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థి ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లగా.. సిబ్బంది ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించలేదు. దీంతో పరీక్షకు హాజరుకాలేకపోయాడు. పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి విద్యార్థులను కేంద్రాల లోపలికి పంపించారు. విద్యార్థులు ఉంగరాలు, ముక్కుపుడకలు ధరించి వస్తే.. వాటిని తొలగించి లోపలికి అనుమతించారు. కొన్ని కేంద్రాల్లో నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులనూ అనుమతించ లేదు.
Published date : 07 May 2023 04:32PM