NEET UG Exam 2023 Question Paper & Key : ఆ ఒక్క రాష్ట్రంలో తప్పించి.. ప్రారంభమైన నీట్... సాక్షిలో నీట్ పేపర్‌తో పాటు కీ..!
రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో తలెత్తిన హింస వల్ల మణిపూర్‌లో నీట్ ఎగ్జామ్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ ఒక్క రాష్ట్రంలో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పరీక్ష ప్రారంభమైంది. సాయంత్రం 5.20 గంటలకు పరీక్ష ముగుస్తుంది.
చదవండి: శభాష్ అమ్మా... డిజిటల్ విధానంలో పరీక్ష పాసై చరిత్ర సృష్టించిన దివ్యాంగ అమ్మాయిలు
నీట్ పరీక్షముగియగానే సాక్షి ఎడ్యుకేషన్‌లో నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం అందుబాటులో ఉంటుంది. అలాగే సబ్జెక్టు నిపుణులతో మాట్లాడిన తర్వాత నీట్ కీని కూడా విద్యార్థుల కోసం సాక్షి ప్రత్యేకంగా చేయిస్తుంది. పరీక్ష పేపర్‌తో పాటు కీని మీరు చూసుకోవచ్చు. అయితే ఇది కేవలం విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే. అంతిమంగా అధికారులు విడుదల చేసే కీనే అధికారికంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.