Skip to main content

NEET All India Topper Success Story : డైలీ ఇలా చ‌దివి.. నీట్‌లో 1st Rank కొట్టానిలా.. అలాగే JEE కూడా..!

వీళ్ల‌ కుటుంబంలో ఇప్పటి వరకూ ఎవరూ డాక్టర్ కాలేదు. డాక్టర్‌ కావాలనే కల బలంగా మృణాల్‌కి ఉండేది. దీంతో పట్టుదలతో నీట్‌కు ప్రిపేరై 720 మార్కులకు 720 మార్కులు సాధించి నీట్ యూజీ-2021 ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు.
Mrinal Kutteri from Hyderabad to Score 720 in NEET UG

అంతే కాకుండా ఏకంగా 99.9 పర్సంటైల్‌తో JEEని కూడా క్రాక్‌ చేశాడు. ఇలా నీట్‌,  జేఈఈ రెండు కొట్టిన వారు చాలా చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో మృణాల్‌ కుట్టెరి విజ‌య ర‌హ‌స్యం మీకోసం...

ఎడ్యుకేష‌న్ : 
మృణాల్ ICSE 10వ తరగతి బోర్డు పరీక్షలలో 98.16% మార్కులు వ‌చ్చాయి. అలాగే 12వ తరగతి బోర్డులలో 88.6% స్కోర్ చేశాడు. టెన్త్‌ క్లాస్‌ చదివేటప్పుడు ఒలింపియాడ్‌లు, స్పెల్‌బీస్, క్విజ్‌లలో పాల్గొన్నారు. 11-12 తరగతుల సమయంలోనే అతని దృష్టి NEET UG ప్రిపరేషన్‌పైకి మళ్లిందని చెప్పాడు. 

ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా..
12వ తరగతిలో కేవలం NEETకి మాత్రమే ప్రిపరేషన్‌ సాగించిన.. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా KVPY, JEE మెయిన్‌లను క్రాక్‌ చేశాడు. అలాగే JEE మెయిన్ పరీక్షలో 99.9 శాతం స్కోర్ సాధించాడు. NTA NEET 2021 ప్రవేశ పరీక్షలో 720కి 720 స్కోర్‌తో ఆల్ ఇండియా 1st ర్యాంక్ సాధించాడు.

నీట్(NEET) వైపు అతని ప్రయాణం సుమారు...
8-9 తరగతుల నుంచే మృణాల్‌కు జీవశాస్త్రం, రసాయన శాస్త్రంపై అమిత ఆసక్తిని పెంచుకున్నాడు. నీట్(NEET) వైపు అతని ప్రయాణం సుమారు 3.5 సంవత్సరాలు సాగింది. 11-12 తరగతులు చదివే సమయంలోనే నీట్ ప్రిపరేషన్‌ సాగించాడు. ఆ తర్వాత నీట్ యూజీ-2021లో పరీక్ష రాసి ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు.

హైదరాబాద్‌లో...
మృణాల్ కుట్టేరి... హైదరాబాద్‌లో పుట్టి పెరిగాడు. తల్లిదండ్రులు, తమ్ముడు, తాతయ్యలు కుటుంబ సభ్యులు. మృణాల్‌ తల్లిదండ్రులు వాస్తవానికి కేరళకు చెందినవారు.

కరోనా మహమ్మారి సమయంలో...
మొదట్లో నేను ఆర్మీ డాక్టర్‌ని కావాలనుకున్నాను. మెడిసిన్, అడ్వెంచర్ జీవితాన్ని గడపాలనుకున్నాను. కానీ అది క్రమంగా మెడిసిన్‌పై ఆసక్తిగా మారింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులను ఫ్రంట్‌లైన్‌లో చూడటం స్ఫూర్తిదాయకంగా అనిపించింది. సరిగ్గా COVID-19 మహమ్మారి సమయంలోనే మృణాల్ నీట్ టాపర్‌గా నిలిచాడు. నిజానికి ఆ టైంలో ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్ క్లాస్‌లకు మారడం వల్ల చాలా మంది విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. మృణాల్ మాత్రం తన ప్రిపరేషన్ సాఫీగా సాగించాడు.

అస‌లు టైమ్‌టేబుల్ పాటించ‌లేదు... కానీ...
చాలా మంది టాపర్‌ల మాదిరిగానే మృణాల్ టైమ్‌టేబుల్‌ను ఖచ్చితంగా పాటించడం వంటివి చేయలేదట. కఠినమైన షెడ్యూల్‌ను పెట్టుకోవ‌డం.., దానికి కట్టుబడి ఉండటం ఎన్నడూ చేయలేదన్నాడు. ప్రతిరోజూ కొన్ని చిన్నచిన్న లక్ష్యాలు ఏర్పరచుకుని వాటిని పూర్తి చేసేవాడినని, అయితే ఇలా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయని, కానీ తాను డిమోటివేట్ అవ్వలేదని అన్నాడు. 

అస్సలు చదవని రోజులు కూడా..
స్టడీ అవర్స్రో జురోజుకూ మారుతూ ఉండేవని చెప్పాడు. అధికంగా చదివిన రోజులేకాదు... అస్సలు చదవని రోజులు కూడా ఉన్నాయట. ఇలా తన స్టడీ రొటీన్‌లో వైవిధ్యం ఉన్నప్పటికీ, మృణాల్ సగటున రోజుకు 4 గంటలు చదువుకునేవాడినని.. 5 గంటలకు మించి ఏ రోజూ ఎక్కువ చదవలేదని తన ప్రిపరేషన్‌ మోథడ్స్‌ను తెలిపారు. 

మై హాబీస్..
ఖాళీ సమయంలో పాటలు వినడం, కామెడీ మువీలు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌లలో చూసేవాడినని తెలిపాడు. మృణాల్ ఆటలు కూడా బాగా ఆడేవారు.

Published date : 30 Jan 2025 03:33PM

Photo Stories