Skip to main content

Top 10 Highest paying Govt Jobs: అత్య‌ధిక వేత‌నం ఇచ్చే ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవే

ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చిందంటే ఎగిరి గంతేస్తారు. దేశంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఉండే డిమాండ్ తెలిసిందే. ఇందుకోసం అభ్య‌ర్థులు ఏళ్ల‌కు ఏళ్లు క‌ష్ట‌ప‌డి చ‌దువుతుంటారు. అయితే ప్ర‌భుత్వ కొలువుల్లో అత్య‌ధిక వేతనం ఇచ్చే టాప్ ఉద్యోగాల గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.
Top 10 Highest paying Govt Jobs
Top 10 Highest paying Govt Jobs

ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్‌ స‌ర్వీస్‌(ఐఏఎస్‌)
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్ర‌తీ ఏడాది సివిల్స్ ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది. ఈ ప‌రీక్ష రాయ‌డానికి క‌నీస విద్యార్హ‌త డిగ్రీ. ఈ ఎగ్జామ్‌ను క్లియ‌ర్ చేసి, ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన వారికి నెల‌కు మూల వేత‌నం రూ.56,100 వ‌స్తుంది. దీనికి టీఏ, డీఏ, హెఆర్ఏ, అల‌వెన్స్‌లు అద‌నం. 

ఇండియ‌న్ పోలీస్‌ స‌ర్వీస్‌(ఐపీఎస్‌)
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్ర‌తీ ఏడాది సివిల్స్ ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది. ఈ ప‌రీక్ష రాయ‌డానికి క‌నీస విద్యార్హ‌త డిగ్రీ. ఈ ఎగ్జామ్‌ను క్లియ‌ర్ చేసి, ఐపీఎస్‌గా సెలెక్ట్ అయిన వారికి నెల‌కు మూల వేత‌నం రూ.56,100 వ‌స్తుంది. దీనికి టీఏ, డీఏ, హెఆర్ఏ, అల‌వెన్స్‌లు అద‌నం. 

చ‌ద‌వండి: మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి

ఇండియ‌న్ ఫారెస్ట్‌ స‌ర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌)
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్ర‌తీ ఏడాది సివిల్స్ ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది. ఈ ప‌రీక్ష రాయ‌డానికి క‌నీస విద్యార్హ‌త డిగ్రీ. ఈ ఎగ్జామ్‌ను క్లియ‌ర్ చేసి, ఐఎఫ్‌ఎస్‌గా సెలెక్ట్ అయిన వారికి నెల‌కు మూల వేత‌నం రూ.60,000 వ‌స్తుంది. దీనికి టీఏ, డీఏ, హెఆర్ఏ, అల‌వెన్స్‌లు అద‌నం.

ఇండియ‌న్ ఫారిన్‌ స‌ర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌)
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్ర‌తీ ఏడాది సివిల్స్ ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది. ఈ ప‌రీక్ష రాయ‌డానికి క‌నీస విద్యార్హ‌త డిగ్రీ. ఈ ఎగ్జామ్‌ను క్లియ‌ర్ చేసి, ఐఎఫ్‌ఎస్‌గా సెలెక్ట్ అయిన వారికి నెల‌కు మూల వేత‌నం రూ.60,000 వ‌స్తుంది. దీనికి టీఏ, డీఏ, హెఆర్ఏ, అల‌వెన్స్‌లు అద‌నం.

ఆర్బీఐ గ్రేడ్‌-బి
భార‌త కేంద్ర బ్యాంక్ అయిన రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వ‌హించే గ్రేడ్‌-బి ప‌రీక్ష ఉత్తీర్ణ‌త సాధించి సెలెక్ట్ అయిన వారు బ్యాంకింగ్ రంగంలో దూసుకెళ్లిపోవ‌చ్చు. ఈ ప‌రీక్ష‌కు సంబంధిత డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఒక్క‌సారి సెలెక్ట్ అయిన వారికి ఏడాదికి రూ.18 ల‌క్ష‌ల వేత‌నం ల‌భిస్తుంది. టీఏ, డీఏ, హెఆర్ఏ, అల‌వెన్స్‌లు అద‌నంగా ల‌భిస్తాయి. 

Top 10 Highest paying Govt Jobs: అత్య‌ధిక వేత‌నం ఇచ్చే ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవే

డిఫెన్స్ స‌ర్వీస్‌
ర‌క్ష‌ణ బ‌ల‌గాల‌ల్లో నియామ‌కాల కోసం డిఫెన్స్ స‌ర్వీస్ ప్ర‌తీ ఏడాది ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంది. ఈ ప‌రీక్ష రాయ‌డానికి ఇంట‌ర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఒక‌సారి సెలెక్ట్ అయితే నెల‌కు మూల‌వేత‌నం కింద రూ.68 వేలు అందుతుంది. ఈ వేత‌నానికి టీఏ, డీఏ, హెఆర్ఏ, అల‌వెన్స్‌లు అద‌నం.

ఇస్రో, డీఆర్‌డీఓ లో సైంటిస్ట్‌
భార‌త అంత‌రిక్ష సంస్థ‌, అలాగే డీఆర్‌డీఓ లో సైంటిస్ట్‌గా ఎంపికైన వారికి భారీగా వేత‌నాలు అందుతాయి. ఇందుకు సంబంధించిన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణుల‌వ్వాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన వారికి నెల‌కు మూల‌వేత‌నం రూ.60 వేల‌దాకా వ‌స్తుంది. ఇందుకు టీఏ, డీఏ, హెఆర్ఏ, అల‌వెన్స్‌లు అద‌నంగా ల‌భిస్తాయి. 

ప్ర‌భుత్వ లెక్చ‌ర‌ర్స్‌
ప్ర‌భుత్వ ఇంట‌ర్‌, డిగ్రీ క‌ళాశాల‌ల్లో లెక్చ‌ర‌ర్స్ పోస్టుల‌కు సంబంధించి ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి నెల‌కు మూల వేత‌నం కింద రూ. 40 వేలు అందుతుంది. అలాగే యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ నిర్వ‌హించే నెట్ ప‌రీక్ష‌ను కూడా క్లియ‌ర్ చేయాల్సి ఉంటుంది. 

88 Lakh salary package: అద‌ర‌గొట్టిన వ‌రంగ‌ల్ నిట్ విద్యార్థి.... 88 ల‌క్ష‌ల ప్యాకేజీతో రికార్డు

ఎస్ఎస్‌సీ సీజీఎల్‌
స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ ప్ర‌తీ ఏడాది సీజీఎల్ ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది. కేంద్ర ప్ర‌భుత్వంలోని వివిధ విభాగాల్లోని ఖాళీల‌ను ఈ ప‌రీక్ష ద్వారా భర్తీ చేస్తుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఈ ప‌రీక్ష‌లో సెలెక్ట్ అయిన వారికి మూల‌వేత‌నం కింద నెల‌కు రూ.45 వేలు అందుతుంది.

Published date : 08 May 2023 06:21PM

Photo Stories