Skip to main content

UPSC released job Notification: UPSC నుంచి మరో గుడ్‌న్యూస్‌.. భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

UPSC jobs
UPSC jobs

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 705 పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండే వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో విధానంలో ఫిబ్రవరి 19వ తేది నుండి మార్చి 11వ తేది లోపు సబ్మిట్ చేయాలి.

భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ హెల్త్ సర్వీస్ , రైల్వేస్, న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లలో మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

పోస్టుల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 705 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు : MBBS పాస్ అయిన వారు అర్హులు. (లేదా) MBBS చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులు. అప్లికేషన్ ఫీజు :

  • GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 200/-
  • SC / ST / PwBD మరియు మహిళలకు అప్లికేషన్ ఫీజు లేదు.

అప్లికేషన్ చివరి తేది : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలైన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 11-03-2025 లోపు అప్లై చేయాలి.

జీతం: ఈ ఉద్యోగాలకు లెవల్-10 ప్రకారం 56,100/- నుండి 1,77,500/- వరకు జీతము ఇస్తారు.

వయస్సు వివరాలు :

  • సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 32 సంవత్సరాలు లోపు ఉండాలి.

వయస్సులో సడలింపు వివరాలు :

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
  • PwBD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు చదివింపు వర్తిస్తుంది.
     

ఎంపిక విధానం :

  • అప్లై చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష, పర్శనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • రాత పరీక్ష 500 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
  • పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూకు 100 మార్కులకు నిర్వహిస్తారు.

Download Notification: Click Here

Apply Online:
Click Here

Published date : 25 Feb 2025 05:40PM

Photo Stories