IIM Sambalpur: 65 లక్షల ప్యాకేజీతో అదరగొట్టిన ఎంబీఏ అమ్మాయి... అత్యధిక వేతనంతో రికార్డు
చదవండి: నిట్ విద్యార్థికి రూ.88 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం
జాబ్ మార్కెట్లో కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, ఐఐఎం సంబల్పూర్ 2021-2023 బ్యాచ్‌కు చెందిన ఒక విద్యార్థిని ఈ ఏడాది నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో రూ. 64.61 లక్షల వేతనంతో అదరగొట్టింది. జైపూర్‌కు చెందిన అవనీ మల్హోత్రాను అత్యధిక ప్యాకేజీ ఆఫర్ చేసి మైక్రోసాఫ్ట్ ఎగరేసుకునిపోయింది. అవనీ మల్హోత్రా ఇప్పటికే కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది.
ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆమె టాప్ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌లో మూడేళ్ల పాటు ఉద్యోగం చేసింది. ఆ తర్వాత బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేసేందుకు ఒడిశాలోని సంబల్పూర్ క్యాంపస్‌లో చేరింది.
సాధారణంగా ఐఐఎం సంబల్పూర్‌లో ఎంబీఏ ఉత్తీర్ణుణలైన వారికి ఇప్పటివరకు సగటున రూ.16 లక్షల వేతనంతో ఉద్యోగాలు వచ్చేవి. ఈ ఏడాది ఆ రికార్డు కూడా చెరిగిపోయింది. ఈ ఏడాది సగటు వేతనాలు 146 శాతం పెరిగాయి. అలాగే అవనీ మల్హోత్రా రూ.65 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం ఐఐఎం సంబల్పూర్ చరిత్రలోనే మొదటిసారి.
Inspirational Story : నాడు పుస్తెలతాడు కూడా తాకట్టు పెట్టా..నేడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నానిలా..
అవనీకి ఈ ప్యాకేజీ అంత ఈజీగా రాలేదు. మైక్రోసాఫ్ట్ దాదాపు ఆరు రౌండ్ల పాటు ఆమెను ఇంటర్వ్యూ చేసింది. అన్ని రౌండ్లలో ఆమె చూపిన ప్రతిభకు ఈ ప్యాకేజీ దక్కింది. ఐఐఎం సంబల్పూర్లో ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం డెలాయిట్, అమెజాన్, ఈవై, యాక్సెంచర్, అమూల్, మైక్రోసాఫ్ట్, వేదాంత కంపెనీలు వచ్చాయి.
2021-23 బ్యాచ్ ఐఐఎం సంబల్పూర్ విద్యార్థులందరికీ 100 శాతం ప్లేస్ మెంట్స్ వచ్చినట్లు ఐఐఎం సంబల్పూర్ ఓ ట్వీట్‌లో తెలిపింది. ఈ ఏడాది దాదాపు 130కి పైగా కంపెనీలు ప్లేస్‌మెంట్స్ కోసం వచ్చాయని, ఫస్ట్ టైమ్ రిక్రూటర్లలో 56 శాతం వృద్ధి నమోదైందని ట్వీట్‌లో వివరించింది.