Skip to main content

Microsoft: ఉద్యోగులను ఆకర్షిస్తున్న నంబర్‌1 టెక్‌ దిగ్గజం ఇదే..

భారత్‌లో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా మైక్రోసాఫ్ట్‌ మొదటి స్థానంలో నిలిచింది.
Microsoft ranked first as most attractive company in India   "Opinions of 1,73,000 representatives on top companies worldwide  Most attractive companies based on 3,507 Indian views  Survey results

టీసీఎస్, అమెజాన్‌ రెండు, మూడో స్థానాల్లో ఉన్నట్టు ‘ర్యాండ్‌స్టాడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ (ఆర్‌ఈబీఆర్‌) 2024’ నివేదిక తెలిపింది. ఆర్థిక సామర్థ్యం, మంచి పేరు, కెరీర్‌లో చక్కని పురోగతి అవకాశాలు ఈ మూడూ ఉద్యోగులు ప్రధానంగా చూసే అంశాలు. వీటి పరంగా మైక్రోసాఫ్ట్‌ ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1,73,000 మంది ప్రతినిధులు, 6,084 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా ర్యాండ్‌స్టాడ్‌ తెలుసుకుంది. భారత్‌ నుంచి 3,507 మంది అభిప్రాయాలు స్వీకరించింది.

భారత్‌లో అత్యంత ఆకర్షణీయమైన టాప్ 10 కంపెనీలు ఇవే.. 
1.మైక్రోసాఫ్ట్
2.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
3.అమెజాన్
4.టాటా పవర్ కంపెనీ
5.టాటా మోటార్స్
6.శామ్‌సంగ్‌ ఇండియా
7.ఇన్ఫోసిస్
8.లార్సెన్ & టూబ్రో(ఎల్‌అండ్‌టీ)
9.రిలయన్స్ ఇండస్ట్రీస్
10.మెర్సిడెస్ బెంజ్ 

Published date : 08 Aug 2024 02:42PM

Photo Stories