IT Jobs 2023 : నిట్ విద్యార్థికి రూ.88 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎలా వచ్చిందంటే..
Sakshi Education
☛ రికార్డు సృష్టించిన వరంగల్ నిట్ విద్యార్థి.
☛ రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం.
☛ మల్టీనేషనల్ కంపెనీనీ మెప్పించిన విద్యార్థి.
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలోని వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చదివిన విద్యార్థి ఆదిత్యసింగ్ రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
నిట్ లో ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్న ఓ మల్టీనేషనల్ కంపెనీ ఈ ఆఫర్ ఇచ్చి ఉద్యోగానికి ఎంపిక చేసినట్టు వరంగల్ నిట్ డైరెక్టర్, ఆచార్య ఎన్వీ రమణారావు తెలిపారు.
ఇది వరంగల్ నిట్ చరిత్రలోనే రికార్డు ప్యాకేజీ అని ఆయన వెల్లడించారు. ఇక్కడి నిట్ లో నాణ్యమైన బోధన, విస్తతమైన పరిశోధనల వల్లే ఇది సాధ్యమైందని డైరెక్టర్ పేర్కొన్నారు.
Success Story : నాడు క్లాసురూమ్ నుంచి బయటికి వచ్చా.. నేడు వేల కోట్లు సంపాదించా..!
Inspirational Story : నాడు పుస్తెలతాడు కూడా తాకట్టు పెట్టా..నేడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నానిలా..
Published date : 07 Apr 2023 06:29PM