Skip to main content

Success Story : నాడు క్లాసురూమ్ నుంచి బయటికి వ‌చ్చా.. నేడు వేల కోట్లు సంపాదించా..!

రితేష్‌ అగర్వాల్‌ పుట్టింది ఒడిశాలోని కటక్‌లో. స్కూల్‌ చదువు అక్కడే సాగింది. కాలేజీలో అడుగు పెట్టాడు కానీ.. అక్కడ ఇమడలేకపోయాడు. క్లాసురూమ్‌లో కన్నా బయటే నేర్చుకోవాల్సింది చాలా ఉందనుకున్నాడు. చదువు మానేశాడు.

చదువు మీద శ్రద్ధ లేదు.. ఏదో ఓ పని చేసి డబ్బు సంపాదించాలి. ఇదే ఆలోచన. కట్‌ చేస్తే.. చిన్న కిరాణ షాపు ఓనర్‌ కొడుకైనా.. ఆ వ్యక్తి 18వ ఏట బిజినెస్‌ ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఇప్పుడు 9 వేల కోట్లకు అధిపతి అయ్యాడు. అతడే ఓయో రూం వ్యవస్థాపకుడు, సీఈఓ రితేష్‌ అగర్వాల్‌. అతడి వ్యాపార ప్రస్తానం ఎందరికో ఆదర్శం. ఈ నేప‌థ్యంలో రితేష్‌ అగర్వాల్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..  

Inspirational Story : నాడు పుస్తెలతాడు కూడా తాకట్టు పెట్టా..నేడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నానిలా..

ఫ్రీగా గది అడిగా.. ఎవ్వరూ ఇవ్వలేదు.. కానీ..

Ritesh Agarwal Story

గెస్ట్‌ హౌస్‌లు, టూరిస్ట్‌ లాడ్జ్‌లు, బడ్జెట్‌ హాస్టళ్లను ఆన్‌లైన్‌లో లిస్ట్‌ చేయడానికి 'ఓరావెల్‌' పేరిట ఓ వెబ్‌సైట్‌ ఆరంభించాడు. దానికోసం దేశమంతా తిరిగాడు. చాలాచోట్ల బసచేశాడు. ఆయా హోటల్స్‌ లిస్ట్‌ చేస్తున్నపుడు.. అక్కడ తను ఉండటానికి ఫ్రీగా గది ఇవ్వాలని అడిగేవాడు. ''ఎవ్వరూ ఇవ్వలేదు. నేను వాళ్ల వ్యాపారాల్ని లిస్ట్‌ చేస్తున్నందుకు వాళ్లు ఆ మాత్రం కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యమనిపించింది'' అంటాడు రితేష్‌. 

Inspirational Story : ఇరవై ఒక్కవేల పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం.. నా స‌క్సెస్ సిక్రెట్ ఇదే..

అయితే ఇలా దేశమంతా తిరగటంలో రితేష్‌కు పలు విషయాలు తెలిసొచ్చాయి. వాటిలో మొదటిది.. చిన్న హోటళ్లు, బడ్జెట్‌ హోటళ్లలో గదులు ఏమాత్రం బాగులేవని.!

ఓయోకు బీజం ఇదే..

OYO Ritesh Agarwal Success Story

ఆన్‌లైన్‌లో హోటల్‌ గదిని ముందుగా బుక్‌ చేసుకోవాలనుకుంటే అది ఎలా ఉంటుందో తెలీదు. సిబ్బంది ఎలాంటివారో, భోజనం ఎలా ఉంటుందో.. ఏమీ తెలీదు. ఇవన్నీ చూశాక.. బడ్జెట్‌ హోటల్స్‌ లో స్టార్‌ హోటల్‌ అనుభవాన్నిస్తే విజయం తథ్యమనిపించింది. ఇదే ఓయోకు బీజం వేసింది'' అంటారు రితేష్‌. 

☛ Inspiring Success Story : ఈ ఐడియాతో రూ.33 వేల కోట్లకు అధిపతి అయ్యాడిలా..

చిన్న బడ్జెట్‌ హోటల్స్‌ తో ఒప్పందం చేసుకొని.. వాటిలో కొన్ని గదుల్ని ఏసీతో, అందంగా, ఆరోగ్యకరంగా మార్చడం చేశాడు. ఫ్రీ వై–ఫై, టీవీ, బ్రేక్‌ఫాస్ట్‌ ఏర్పాట్లు చేశాడు. ఆన్‌లైన్లో ఫోటోలు కూడా ఉండటంతో.. వాటికి ఆదరణ పెరిగింది. 

ఓయో రూమ్స్‌తో మొదలై.. ఐదేళ్లలో ఓయో టౌన్‌హౌస్, ఓయో హోమ్స్, ఓయో సిల్వర్‌కీ వంటి పలు విభాగాల్లోకి విస్తరించారు. ప్రస్తుతం చైనా, మలేషియా, నేపాల్‌లోనూ ఓయో సేవలు అందిస్తోంది. అంతర్జాతీయ హోటల్‌ కంపెనీలతో సహా పలు ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు ఓయోలో పెట్టుబడులు పెట్టాయి. ఇపుడు ఓయో విలువ.. బిలియన్‌ డాలర్లపైనే..!

☛ Success Story: పెట్టుబ‌డి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు.. ఇదే నా సక్సెస్ మంత్ర..

ఈ రెండు లక్షణాలు ఉంటే..చాలు..

OYO Ritesh Agarwal Success Tips


జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలన్నా.. బాగా సంపాదించాలన్న గొప్ప గొప్ప చదువులతో పాటు.. తన చుట్టు ఉన్నా పరిస్థితిల గురించి.. కాలానికి తగ్గట్టు మారుతున్న అవసరాల గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఉంటే.. గొప్ప గొప్ప డిగ్రీలు లేకపోయినా సరే వ్యాపారంలో విజయం సాధించవచ్చు.

కుటుంబ నేప‌థ్యం :
ఒడిశా రాయగడ జిల్లాకు చెందిన రితేష్‌ తల్లిదండ్రులు కిరాణ షాపు నడిపి.. కుటుంబాన్ని పోషించేవారు. రితేష్‌కు చిన్నప్పటి నుంచి ఏదో పని చేసి డబ్బు సంపాదించాలని కోరిక. అందుకే 13వ ఏట నుంచే మొబైల్‌ సిమ్‌ కార్డులు అమ్మడం ప్రారంభించాడు. అలా పని చేసుకుంటూనే స్కూల్‌ చదువు పూర్తి చేశాడు. తర్వాత ఢిల్లీ వెళ్లి కాలేజీలో జాయిన్‌ అయ్యాడు.

☛ Inspiration Story: ఓ నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చి..వేల కోట్లు సంపాదించాడిలా..

ఆ డబ్బుతో ఓయో ప్రారంభించా..

Ritesh Agarwal CEO OYO

అక్కడ కూడా చదువు మీద కన్నా సంపాదన మీదే దృష్టి మరలింది. దాంతో కాలేజ్‌ చదువును మధ్యలోనే ఆపేసి.. 2012లో ఒరావెల్‌ సెస్ట్‌ పేరిట హోటల్‌ బుకింగ్‌ పోర్టల్‌ స్థాపించాడు. అప్పుడు అతడి వయస్సు 17 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత ఓ కాంపిటీషన్‌లో స్కాలర్‌ షిప్‌ గెల్చుకుని.. ఆ డబ్బుతో 2013లో ఓయో రూమ్స్‌(ఓన్‌ యువర్‌ ఓన్‌) స్థాపించాడు. అప్పుడు అతడి వయసు 18 ఏళ్లు మాత్రమే.

అతడిని పిలిపించుకుని..

Ritesh Agarwal With PM Modi

ఆ తర్వాత వ్యాపారం నెమ్మదిగా పుంజుకుంది. ప్రసుత్తం ఇండియా వ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం దీన్ని యూరప్‌, అమెరికాలో కూడా విస్తరించే పనిలో ఉన్నాడు. రితేష్‌ గురించి తెలుసుకున్న ట్రంప్‌.. ఇండియా వచ్చినప్పుడు.. అతడిని పిలిపించుకుని మరి మాట్లాడాడు. ప్రధాని, రాష్ట్రపతి, అధాని అందరూ అతడిని ప్రశంసించారు. ప్రస్తుతం రితేష్‌ వయసు 28 సంవత్సరాలు. అతడి ఆస్తి రూ.9000 కోట్లు పైగానే. కరోనా ముందు వరకు 1000 కోట్ల వరకు ఉండేది. కానీ మహమ్మారి ఫలితంగా తగ్గిపోయింది. గొప్ప చదువులు లేకపోయినా.. తనపై నమ్మకంతో.. స్వయంకృషితో బిలియనీర్‌గా ఎదిగిన రితేష్‌.. 

☛ Inspiring Success Story : ప‌రీక్ష‌ల్లో ఫెయిల్‌.. జీవితంలో పాస్‌.. ఏడాది రూ.2 కోట్ల పైగా ఆదాయంతో..

Published date : 28 Oct 2022 05:10PM

Photo Stories