Skip to main content

Manu Bhaker Inspirational Story : యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపేర్‌ అవ్వాల‌నుకున్నా.. ఒలింపిక్స్‌ మెడల్ కొట్టా.. కానీ ల‌క్ష్యం ఇదే..!

ఒక బ‌ల‌మైన ల‌క్ష్యం ఎంపిక చేసుకోని.. దాని కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి.. చివ‌రికి అనుకున్న ల‌క్ష్యం చిత్తు చేయడం ఈమె నైజం. మూడేళ్ల క్రితం మనూ భాకర్‌ టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది.
Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 2024

19 ఏళ్ల ఒక అమ్మాయి మెగా ఈవెంట్‌లో మొదటిసారి.. అదీ మూడు ఈవెంట్లలో పోటీ పడటం చిన్న విషయం కాదు. కానీ అసాధారణ ప్రతిభతో దూసుకొచ్చిన ఈ షూటర్‌ అలాంటి అవకాశం సృష్టించుకుంది. నిజానికి అప్పటి వరకు ఆమె సాధించిన ఘనతలే భాకర్‌పై అంచనాలు భారీగా పెంచేశాయి. చివరకు అదే ఒత్తిడి ఆమెను చిత్తు చేసింది. 
టోక్యో ఒలింపిక్స్‌కు ముందు వరకు పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకుంది. 

ఈమె జాబితా చాలా పెద్దది..

Manu Bhaker Wins Many Prizes

జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో రెండు స్వర్ణాలు, యూత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం, ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, వరల్డ్‌ కప్‌లలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు... ఇలా ఈ జాబితా చాలా పెద్దది. దాంతో ఇదే జోరులో ఒలింపిక్‌ పతకం కూడా దక్కుతుందని అంతా ఆశించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇదేదో ఆటలో ఓటమిలా కాదు! క్వాలిఫయింగ్‌ పోటీల్లో కీలక సమయంలో భాకర్‌ పిస్టల్‌ సాంకేతిక సమస్యల కారణంగా పని చేయలేదు. దానిని సరిచేసుకొని వచ్చేసరికి ఆరు నిమిషాల కీలక సమయం వృథా అయింది. అయినా సరే 60 షాట్‌ల ద్వారా 575 పాయింట్లు సాధించడం విశేషం. చివరకు కేవలం రెండు పాయింట్ల తేడాతో ఫైనల్‌ అవకాశం కోల్పోయిన మను కన్నీళ్లపర్యంతమైంది. ఈ ప్రభావం మరో రెండు ఈవెంట్లపై పడి ఆమె కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది.

ఓటమి భారంతో కుంగిపోయిన దశ నుంచి మళ్లీ..

Manu Bhaker Inspire Stroy in Telugu

ఒలింపిక్‌ పతకం ప్రతిభ ఉంటేనే కాదు.. ధైర్యవంతులకే దక్కుతుంది! శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు ఓటమి భారంతో కుంగిపోయిన దశ నుంచి మళ్లీ పైకి లేవడం ఎంతో ధైర్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా ఇలాంటి పరాజయం తర్వాత కుప్పకూలిపోతారు. టోక్యో ఒలింపిక్స్‌ వైఫల్యం తర్వాత ఇతర షూటర్లు అపూర్వీ చండీలా, అభిషేక్‌ వర్మ, మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో ఆమె సహచరుడు సౌరభ్‌ చౌదరీ మళ్లీ కెరీర్‌లో ముందుకు వెళ్లలేక దాదాపుగా షూటింగ్‌కు దూరమయ్యారు. ఒకదశలో మనూ కూడా అలాగే ఆలోచించింది.

ఆటకు గుడ్‌బై చెప్పి సివిల్‌ సర్వీసెస్ వైపుకు..

Manu Bhaker Real Life Story in Telugu

షూటింగ్‌ తనలో ఆసక్తి రేపడం లేదని, ఇక ఆటకు గుడ్‌బై చెప్పి సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకుంది. కానీ సన్నిహితుల కారణంగా ‘చివరిసారిగా మళ్లీ ప్రయత్నిద్దాం’ అనే ఆలోచన మళ్లీ షూటింగ్‌లో కొనసాగేలా చేసింది. ఈసారి కూడా అంతే స్థాయిలో కఠోర సాధన చేసింది. ఏకాగ్రత చెదరకుండా ఒకే లక్ష్యానికి గురి పెట్టింది. దాంతో మళ్ళీ ఫలితాలు వచ్చాయి. 

జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో స్వర్ణం, వరల్డ్‌ కప్‌లలో రెండు కాంస్యాలు, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, కాంస్యాలు దక్కాయి. 22 ఏళ్ల వయసులో మనూ భాకర్‌ ఇప్పుడు ఒలింపిక్‌ పతక విజేతగా తానేంటో నిరూపించుకుంది. గత ఒలింపిక్స్‌ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ సగర్వంగా నిలిచింది.

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిపెట్టడం ద్వారా షూటింగ్‌లో 12 ఏళ్ల కరువును మను భాకర్ ముగించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గర్వించేలా చేసింది. మను వయసు కేవలం 22 ఏళ్లే.. అయినా తన ప్రతిభతో ప్రపంచంలోనే పేరు తెచ్చుకుంది. మను భాకర్ 2018లో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పతకం సాధించింది. ఇది మాత్రమే కాదు, మను ISSF ప్రపంచ కప్‌తో పాటు, కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా పతకాలు సాధించింది. మను 22 ఏళ్లకే కోటీశ్వరాలైంది.

మను భాకర్ నికర విలువ, టోర్నమెంట్ల నుంచి వచ్చిన డబ్బు, ప్రైజ్ మనీ, ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్‌లతో కలిపి మొత్తం రూ.12 కోట్లు అందుకుంది. మను భారతదేశంలో షూటింగ్ పోస్టర్ గర్ల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆమె పాపులారిటీ గురించి మాట్లాడితే, ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 2 లక్షల మంది, X లో 1.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన మను భాకర్‌ను హర్యానా ప్రభుత్వం సత్కరించి రూ.2 కోట్లు అందజేసింది. టోర్నమెంట్లలో గెలుపొందిన వారికి ప్రభుత్వాలు ప్రైజ్ మనీ అందిస్తున్న సంగతి తెలిసిందే. OG Q మను భాకర్‌ను స్పాన్సర్ చేస్తుంది. 

Published date : 30 Jul 2024 09:13AM

Photo Stories