Skip to main content

Good News for Employees : గుడ్‌న్యూస్‌.. ఈ ఉద్యోగుల‌కు కూడా పండ‌గ బోన‌స్‌.. కానీ ఏపీలో మాత్రం...

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలతో పాటు.. ప్రైవేట్ కంపెనీలు కూడా ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా త‌మ ఉద్యోగుల‌కు బోన‌స్ ప్ర‌క‌టిస్తున్నాయి. అలాగే సింగ‌రేణి ఉద్యోగుల‌కు కూడా తెలంగాణ ప్ర‌భుత్వం భారీగా బోన‌స్ ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే.
dasara festival bonus for employees

ఇందులో భాగంగా..కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-C ఉద్యోగులు, గ్రూప్-బి నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది.

➤☛ Good News For Employees : ఉద్యోగుల‌కు ఈ నెల‌లో పండ‌గే పండ‌గ‌.. ఒక వైపు బోన‌స్‌.. మ‌రో వైపు భారీగా...?

అర్హులు వీరే..
2024 మార్చి 31లోపు ఉద్యోగంలో చేరిన, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 నెలలు విధులు నిర్వహించిన వారు బోనస్‌కు అర్హులు. పనిచేసిన రోజులను బట్టి చెల్లింపులు ఉంటాయి. అర్హులైన ఉద్యోగులకు యావరేజ్‌గా రూ.6908 బోనస్ అందుతుంది. కేంద్ర పారామిలిటరీ, ఆర్మీ ఉద్యోగులూ అర్హులే. 

అయితే ఏపీలో మాత్రం విచిత్రంగా...
దసరా కానుకగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ DAలు, PRC, IR ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నా దసరా కానుకగా IR ప్రకటించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది. నూతన వేతన సవరణ కోసం కమిటీకి వెంటనే ఛైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. గత ప్రభుత్వం వేసిన కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు పేర్కొంది. ఏపీలో మాత్రం ఉద్యోగుల విష‌యంలో ప్ర‌భుత్వం క‌ఠిన వైఖ‌రితో ఉంటున్న విష‌యం తెల్సిందే. చాలా మంది ఏపీ ఉద్యోగులు ప్ర‌భుత్వ తీరుపై వ్య‌తిరేక దోర‌ణిలో ఉన్నారు.

➤☛ Dasara Bonus For Employees : పండ‌గే.. పండ‌గ‌ ప్ర‌తి ఉద్యోగికి రూ.1.90 లక్షలు ద‌స‌రా బోనస్‌...

Published date : 14 Oct 2024 08:06AM

Photo Stories