Skip to main content

HLL Jobs Recruitment 2024 : హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో 1121 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హెచ్‌ఎల్‌ఎల్ కేంద్రాల్లో 1121 ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తుంది.
HLL Jobs Recruitment 2024

అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 4, 5 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. 

పోస్టుల వివ‌రాలు ఇవే..
సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్ 357 పోస్టులు ఉన్నాయి. అలాగే డయాలసిస్ టెక్నీషియన్ 282 పోస్టులు ఉన్నాయి. జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్ 264 ఉద్యోగాలు.., అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్ 218 పోస్టులు ఉన్నాయి. పోస్టును బ‌ట్టి సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్సు/ డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆగ‌స్టు 1వ తేదీ 2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు. వాక్-ఇన్-సెలక్షన్‌కు హాజరు కాలేని అభ్యర్థులు తమ సీవీని hrhincare@lifecarehll.com కు  2024 సెప్టెంబ‌ర్ 7వ తేదీలోగా ఈమెయిల్‌ చేయాలి.

వాక్ ఇన్ సెలక్షన్‌ తేదీలు : 2024 సెప్టెంబ‌ర్‌ 4, 5

వేదికలు : 
పుణె, నాగ్‌పుర్, నాసిక్, షోలాపూర్, నాందేడ్, నవీ ముంబయి, అమరావతి, ఔరంగాబాద్, కొల్హాపూర్, లాతూర్.

జీతం : 
నెలకు అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.24,219 వేత‌నం ఇస్తారు. జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.29,808. డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.35,397. సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.53,096 జీతం ఇస్తారు.

➤☛ Vacancies In Indian Overseas Bank: ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో 550 పోస్టులు.. చివరి తేదీ ఇదే

Published date : 29 Aug 2024 07:06PM
PDF

Photo Stories