Skip to main content

Inspiring Success Story : ఈ ఐడియాతో రూ.33 వేల కోట్లకు అధిపతి అయ్యాడిలా.

జీరో నుంచి హీరో వరకు సాగిన తన జీవిత ప్రయాణంలో ముఖ్య ఘట్టాలన్ని క్రమం తప్పకుండా వివరిస్తున్నారు వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌.
Vedanta Anil Agarwal Inspiring Success Story
Vedanta Anil Agarwal

చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముక్క ఇంగ్లీష్‌ రాకుండా ముంబై రావడం.. అక్కడ అప్పు చేసి షంషేర్‌ కేబుల్‌ కంపెనీ కొనడం.. ఆ తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక తాను పడిన పాట్లను ఆయన వివరించారు. త‌న జీవితం ఎదుర్కొన్న‌ కీలక ఘట్టాల‌కు సంబంధించిన అంశాలు వెల్లడించారు.

అప్పు చేసి..
1986లో రూల్స్‌ మార్చేయడంతో ప్రభుత్వ రంగ సంస్థలు షంషేర్‌ నుంచి కేబుళ్లు కొనడానికి భారీ ఎత్తున ఆర్డర్లు ఇవ్వడం మొదలెట్టాయి. వస్తున్న ఆర్డర్లకు తయారీ సామర్థ్యానికి పొంతన లేకపోవడంతో షంషేర్‌ విస్తరణ అవసరమైంది అనిల్‌ అగర్వాల్‌కి. దీంతో సెకండ్‌ హ్యాండ్‌ మిషనరీ కొనాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం నాలుగు కోట్ల రూపాయల అప్పు కూడా చేశాడు.

వ‌చ్చి..రాని ఇంగ్లీష్‌తో.. అమెరికా టూర్‌

అమెరికా టూర్‌


ఆ రోజుల్లో అమెరికాని కొత్త అవకాశాలకు స్వర్గధామంగా చెప్పుకునే వారు. దీంతో తన కలలు సాకారం చేసుకునేందుకు అమెరికా వెళ్లాలని అనిల్‌ అగర్వాల్‌ డిసైడ్‌ అయ్యారు. అంతంత మాత్రంగా వచ్చిన టూటీ ఫ్రూటీ ఇంగ్లీష్‌ భాషా పరిజ్ఞానం, ఇంట్లో వాళ్లు తయారు చేసిన ఘర్‌ కా ఖానాతో నిండిన సూట్‌కేస్‌లతో పాటు అజయ్‌ ఆనంద్‌ అనే బీహారీ ఫ్రెండ్‌ను తోడుగా పెట్టుకుని న్యూయార్క్‌కి పయణమయ్యాడు అనిల్‌ అగర్వాల్‌..

న్యూయార్క్‌లో జేబుదొంగలు ఎక్కువగా ఉంటారని తెలిసిన వాళ్లు చెప్పడంతో తమ దగ్గరున్న ఐదు వందల డాలర్లను జాగ్రత్తగా జేబు దొంగల కంట పడకుండా కోటు లోపలి వైపు జాకెట్‌లో పెట్టుకుని విమానం ఎక్కాడు. అమెరికా చేరిన తర్వాత ఎక్కడ ఉండాలి, సెకండ్‌ హ్యాండ్‌ మిషనరీ కోసం ఎవరినీ సంప్రదించాలనే వివరాలేం తెలియకుండానే అడుగులు మందుకు వేశారు. న్యూయార్క్‌ సిటీలో దిగిదిగగానే పాల మీగడ లాంటి తెల్లటి మంచును చూసి ఆశ్చర్యపోయారు అనిల్‌ అగర్వాల్‌. అయితే ప్రయాణంలో అనిల్‌ అగర్వాల్‌ పక్కసీట్లో కూర్చున్న మిస్టర్‌ కోటావాలాతో పరిచయమైంది. రాజస్థాన్‌లో దూరపు చుట్టరికం కూడా ఉండటంతో నేరుగా వాళ్లింట్లో దిగిపోయారు అనిల్‌ అగర్వాల్‌. తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చినందుకు ప్రతిగా రోజువారి ఇంటి పనిలో సాయం చేయడం, వాళ్ల పిల్లలను స్కూలుకు తీసుకెళ్లడం, టెన్సిస్‌ ఆటలో కంపెనీ ఇవ్వడం పనులు చేసేవారు అనిల్‌ అగర్వాల్‌. ఇక వచ్చి రానీ బ్రోకెన్‌ ఇంగ్లీష్‌లో సెకండరీ మిషనరీ కోసం రోజుకు కనీసం 40 నుంచి 50 వరకు కాల్స్‌ చేసి వివరాలు సేకరించేవారు. 

Success Story: పెట్టుబ‌డి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు.. ఇదే నా సక్సెస్ మంత్ర..

మంచి పనులు చేసుకుంటూ పోతే..

success story


మొక్కను లోతుగా నాటినప్పుడే దాని మంచి పండ్లను పొందగలుతాము. మంచి పనులు చేసుకుంటూ పోతే మంచి ఫలితాలు కూడా వాటంతట అవే వస్తాయి. అలా శ్రమించడం వల్లే విజయాలు తనను వరించాయని చెబుతున్నారు అనిల్‌ అగర్వాల్‌. బ్యాంకులు, బంధువుల నుంచి రూ. 16 లక్షలు అప్పు తెచ్చి 1970వ దశకంలో షంషేర్‌ కేబుల్‌ కంపెనీని అనిల్‌ అగర్వాల్‌ కొనుగోలు చేశారు. అప్పటి వరకు షంషేర్‌ కంపెనీలోని స్క్రాప్‌ని అమ్మేవారు అనిల్‌ అగర్వాల్‌. అలాంటిది ఒక్కసారిగా అదే కంపెనీకి యజమాని అయ్యారు. అయితే అక్కడి నుంచి వ్యాపార నిర్వాహణ పూలబాట కాలేదు.. ఎక్కువగా మాట్లాడితే ముళ్లబాటనే అయ్యింది.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ టాప్ స‌క్సెస్‌ సీక్రెట్స్ ఇవే..

ఉద్యోగుల‌కు జీతం ఇవ్వలేక..
అందినకాడికల్లా అప్పులు చేసి షంషేర్‌ కంపెనీని కొనుగోలు చేశారు అనిల్‌ అగర్వాల్‌. కానీ ఆ సమయంలో కేబుళ్లకు మార్కెట్‌లో ఆశించిన స్థాయి డిమాండ్‌ లేదు. దీంతో నెల తిరిగే సరికి ముడి సరుకు కొనేందుకు డబ్బులు లేకపోగా కార్మికులు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి వచ్చేది. వ్యాపారం లేకపోయినా ప్రతీ నెల జీతాలు చెల్లించడం తలకు మించిన పనయ్యేది అనిల్‌ అగర్వాల్‌కి. పొద్దస్తమానం రుణాల కోసం బ్యాంకుల దగ్గరే పడిగాపులు కాయాల్సి వచ్చేది.కేవలం ఉద్యోగులకు జీతాలు సర్థుబాటు చేయడం కోసం కేబుళ్ల వ్యాపారంలో కొత్త పద్దతులు తెర తీశాడు అనిల్‌ అగర్వాల్‌. మాగ్నెటిక్‌ కేబుల్స్‌, అల్యూమినియం రాడ్స్‌, వివిధ రకాలైన వైర్లు ఇలా తొమ్మిది రకాలైన బిజినెస్‌లలో వేలు పెట్టాడు. ఎక్కడా లాభం రాకపోగా అప్పులు మరింతగా పెరిగాయి. దాదాపు మూడేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది.

పెరిగిన అప్పుల బాధ‌తో..

Success Tips


పెరిగిన అప్పులు ఆర్థిక భారం కారణంగా విపరీతమైన ఒత్తిడి ఎప్పుడూ నాపై ఉండేది. కానీ స్ట్రెస్‌గా ఫీలవుతున్నానంటే ఒప్పుకోబుద్ది అయ్యేది కాదు అనిల్‌ అగర్వాల్‌కి. మానసికంగా తాను ఎంత ఒత్తిడికి లోనవుతున్నాననే విషయం బయటి ప్రపంచానికి తెలియనిచ్చేవాడు కాదు. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా, ఎక్సర్‌సైజులు బాగా చేసేవాడినంటూ స్వయంగా ఆయనే వివరించారు. 

Inspiration Story: ఓ నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చి..వేల కోట్లు సంపాదించాడిలా..

ఏ దేవున్ని వదల్లేదు.. కానీ
ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టాలు వీడకపోవడంతో ఒక్కోసారి భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోయేది. కానీ ఇది నాకో పరీక్షా సమయం అంటూ తనకు తానే సర్థిచెప్పుకునే వాడు. ఆ సమయంలో ధైర్యం కోసం ముంబైలో ఉన్న ముంబాదేవి ఆలయం నుంచి మొదలుపెడితే సిద్ధి వినాయకుడు, హాజి అలీ దర్గా, మహిమ్‌ చర్చ్‌ వరకు ప్రతీ చోటుకి వెళ్లి ప్రార్థనలు చేసే వాడినంటూ ఆనాటి గడ్డు రోజులను నెమరు వేసుకున్నారు అనిల్‌ అగర్వాల్‌.

దూరంగా ఎటైనా వెళ్లాలని..
ఒక్కోసారి ఈ ఒత్తిడి తట్టుకోలేక.. వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా ఎటైనా వెళ్లాలని అనిపించేదని.. అలాంటి సందర్భాల్లో రంగులకలైన సినిమాలకు వెళ్లేవాడినంటూ చెప్పుకొచ్చారు అనిల్‌ అగర్వాల్‌. ఇలా ఓసారి షోలే ప్రీమియం ప్రదర్శనకు వెళ్లగా... లోనికి రానివ్వలేదు. బయటే నిలబడి  అమితాబ్‌ బచ్చన్‌, జయాబాధురి, ధర్మేంధ్రలు రెడ్‌ కార్పెట్‌పై నడుస్తుంటే చూసి.. ఈ జన్మకు ఇది చాలులే అనుకుని సరిపెట్టుకున్నాడు.

దశ తిరిగింది ఇలా..
టెలిఫోన్‌ రంగంలో ప్రైవేటు కంపెనీలు తయారు చేసిన కేబుళ్లను కూడా వినియోగించవచ్చంటూ 1986లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు అంటే దాదాపు పదేళ్ల పాటు కేవలం కష్టాల కడలినే ఓపికగా ఈదినట్టు వెల్లడించారు అనిల్‌ అగర్వాల్‌. 1986 తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదంటున్నారు. 

Motivational Story: కుంగిపోలేదు.. పోరాడి గెలిచాడు.. తనతో పాటు నలుగురికి..

ఈ పాఠాల వల్లే..
ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా ఓ కలలా ఉంది. నా జీవితంలో బిగ్గెస్ట్‌ అచీవ్‌మెంట్‌గా చెప్పుకునే వేదాంత గ్రూపు స్థాపించడంలో షంషేర్‌ కేబుల్‌ నేర్పిన పాఠాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని కచ్చితంగా చెప్పగలను. అందుకే గెలుపు కోరుకునే వారు ఓసారి ఓటమిని కూడా రుచి చూడాలి అని చెబుతున్నారు.

చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఇప్పుడు రూ.33 వేల కోట్లకు..
గత కొంత కాలంగా వేదాంత చైర్మన్‌ అనిల్‌అగర్వాల్‌ తన జీవిత అనుభవాలను ప్రజలతో పంచుకుంటున్నారు. బిజినెస్‌మేన్‌గా ఎదిగే క్రమంలో పడిన ఇబ్బందులు, ఎదురైన ఆటుపోట్లు ప్రజలకు వివరిస్తున్నారు. అందులో భాగంగా ముంబైలో అడుగుపెట్టినప్పుడు తాను కన్న కల నిజమైన క్షణాల్లో తాను పొందిన భావోద్వేగాన్ని ఆయన పంచుకున్నారు. 

Warren Buffett: కటిక పేదరికాన్ని చూశా.. ఆకలి కేకలు పెట్టా.. మీ గుడ్ ఫ్యూచర్‌కు నా సలహా ఇదే..

ఇంగ్లీష్‌ రాదు.. కానీ 
ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీల బాటలోనే పయణిస్తున్నారు అనే కంటే ఫ్యూయల్‌ సెక్టార్‌లో వాళ్లిద్దరికి గట్టి పోటీ ఇస్తున్నారు బిజినెస్‌మేన్‌ అనిల్‌ అగర్వాల్‌. వేదాంత కంపెనీ యజమానిగా గ్రీన్‌ ఎనర్జీ, రియల్‌ ఎస్టేట్‌, మెటల్‌, పవర్‌ జనరేషన్‌, ఆయిల్‌ ఇలా ఒకటేమిటి అనేక రంగాల్లో అడుగుపెట్టి విజయం సాధించాయన. పాట్నాను వదిలి ముంబైకి వచ్చినప్పుడు యస్‌, నో తప్ప మరో ముక్క ఇంగ్లీష్‌ ఆయనకు రాదు. కానీ నేడు రూ. 33.60 వేల కోట్లకు అధిపతి. చేతిలో చిల్లిగవ్వ లేని దశలో తన జీవితాన్ని మలుపు తిప్పిన ఓ సంఘటనను అనిల్‌ అగర్వాల్‌ షేర్‌ చేసుకున్నారు.

లాలు ప్రసాద్‌ యాదవ్‌ అనిల్‌ అగర్వాల్‌ ఒకే స్కూలు..
అనిల్‌ అగర్వాల్‌ స్వస్థలం పాట్నా. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ అనిల్‌ అగర్వాల్‌ ఒకే స్కూలు, ఒకే కాలేజీ. కానీ వంశపార్యంపరంగా వస్తున్న వ్యాపారం వదులకుని తన కలలు నిజం చేసుకునేందుకు ముంబైలో అడుగు పెట్టాడు అనిల్‌. కేబుల్‌ తయారీ కంపెనీల్లో మిగిలిపోయిన స్క్రాప్‌ను అమ్మే వ్యాపారంతో తన జీవితం ప్రారంభించాడు.

Inspiring Success Story: రూ.200 జీతం తీసుకునే గుమాస్తా.. కోట్లకు అధిపతి అయ్యాడిలా..

ఈ కలతోనే..
ఆ రోజుల్లో ముంబైలో కేబుల్‌ వ్యాపారంలో షంషేర్‌ స్టెర్లింగ్‌ కేబుల్‌ కంపెనీ చాలా ఫేమస్‌. ఆ కంపెనీకి సంబంధించిన స్క్రాప్‌ను అనిల్‌ అగర్వాల్‌ అమ్మేవాడు. ఎప్పుడైనా ఇలాంటి కంపెనీకి యజమాని కావాలనే కలలు కనేవాడు. ఈ క్రమంలో ఈ కంపెనీ బ్యాంకు రుణం చెల్లించలేక దివాళా తీయబోతుందనే సమాచారం అందింది అనిల్‌కి. షంషేర్‌ త్వరలో అమ్మకానికి వస్తుందని తెలిసినా చేతిలో చిల్లిగవ్వ  లేని పరిస్థితి. డబ్బులు లేవని నిరాశ చెందలేదు అనిల్‌. ప్రతీరోజు బ్యాంకు దగ్గరికి, ఈ దిశాల కేసు చూస్తున్న లాయర్‌ దగ్గరికి, ఇంకా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని అనిల్‌ కలిసేవాడు. అలా రోజుల తరబడి చేసిన ప్రయత్నంతో షంషేర్‌ కంపెనీ కొనాలంటే తక్కువలో తక్కువ రూ.16 లక్షలు కావాలనే సమాచారం సేకరించగలిగాడు. అంత డబ్బు తన జీవితంలో ఎప్పుడు చూడలేదు. ‍కానీ చేతిలో డబ్బు లేదనే సాకుతో ప్రయత్నం ఆపదలచుకోలేదు.

నిద్రలేని రాత్రులు ఎన్నో..

Vedantha Story


కంపెనీకి సంబంధించిన సమస్త సమాచారం తెలిసిన తర్వాత అతను కంటున్న కలలు అతనికి నిద్రను దూరం చేశాయి. మెలకవుతో కలలు కంటూనే ప్రణాళికలు రూపొందించాడు. రెగ్యులర్‌గా బ్యాంకు అధికారులను కలుస్తూ కొంత రుణం వచ్చేలా చేసుకోగలిగాడు. బ్యాంకు రుణం వస్తుందనే నమ్మకంతో బంధువుల దగ్గర అప్పు తెచ్చాడు. అలా కిందా మీద పడుతూ సొంతగా ఒక్క రూపాయి లేకపోయినా మొత్తానికి రూ.16 లక్షలు కూడబెట్టాడు అనిల్‌ అగర్వాల్‌.

టర్నింగ్‌ పాయింట్ ఇదే..
తెలిసిన అన్ని మార్గాల ద్వారా పోగు చేసిన రూ. 16 లక్షల రూపాయల సొమ్ముతో 1976 మేలో షంషేర్‌ స్టెర్లింగ్‌ కంపెనీని సొంతం చేసుకున్నాడు అనిల్‌ అగర్వాల్‌. ఈ సందర్భంగా సంతకాలు చేస్తున్న సమయంలో కళ్ల వెంట నీళ్లు వచ్చాయని అదే సమయంలో విజయ గర్వంతో నవ్వు కూడా ఆపుకోలేకపోయానంటూ ఆనాటి ఉద్వేగభరిత క్షణాలను పంచుకున్నారు అనిల్‌ అగర్వాల్‌. 

Success Story: ఏ ఒక్క‌ కంపెనీ పెట్ట‌కుండానే.. వేల కోట్లు సంపాదించాడిలా..

మీరు ప్రయత్నిస్తేనే అద్భుతాలే..

Success Tips


మనం ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తే తప్పకుండా కొత్త మార్గాలు కనిపిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు మన ప్రయత్నాలకు తమ వంతు సాయం అందిస్తారు. నా విషయంలో ఇది జరిగింది. మీరు ప్రయత్నించండి ప్రతికూల పరిస్థితుల మధ్య పట్టుదలతో వ్యవహరిస్తే మన కలను సాకారం చేసేందుకు ఊహించని పద్దతిలో ప్రకృతి కూడా సాయం చేస్తుంది. కాబట్టి కలలను నిజం చేసుకోండంటూ నేటి యువతలో ఆయన స్ఫూర్తి నింపుతున్నారు.

Inspiring Success Story : ప‌రీక్ష‌ల్లో ఫెయిల్‌.. జీవితంలో పాస్‌.. ఏడాది రూ.2 కోట్ల పైగా ఆదాయంతో..

Published date : 13 Apr 2022 04:58PM

Photo Stories