Warren Buffett: కటిక పేదరికాన్ని చూశా.. ఆకలి కేకలు పెట్టా.. మీ గుడ్ ఫ్యూచర్‌కు నా సలహా ఇదే..
అన‍్నమో రామచంద్రా అని ఏడ్చారు. పేదరికంతో బాధపడ్డారు. అంతే. అంతవరకే పేదరికాన్ని తిడుతూ కూర్చోలేదు. అవకాశాల్ని వెతుక్కున్నారు. అవకాశాలు లేని చోట దాన్ని సృష్టించుకున్నారు. ఒక్కో క్షణాన్ని కరెన్సీ నోటుగా మార్చడం తెలుసుకున్నారు. ఇలా 91ఏళ్ల వయస్సులో 117 బిలియన్ల (రూ. 8.97 లక్షల కోట్లు) కంటే ఎక్కువ విలువైన బెర్క్‌షైర్ హాత్వేకి ఛైర్మన్, సీఈఓగా ఉన్న బఫెట్ అప్పుడప్పుడు యువతకు ఉపయోగపడేలా సలహాలు ఇస్తుంటారు. తాజాగా తన షేర్ హోల‍్డర్లకు లేఖ రాశారు. అందులో యువత జాబ్‌తో మంచి ఫ్యూచర్ ఎలా పొందవచ్చో తెలిపారు.
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు..
కంపెనీ షేర్‌హోల్డర్‌లకు తన తాజా వార్షిక లేఖలో ..బఫెట్ తన సుదీర్ఘ కెరీర్‌లో పనిని ఆస్వాదించినట్లు చెప్పారు. ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులు పలు అంశాలను గుర్తుంచుకోవాలని చెప్పారు. డబ్బులు కోసం ఎప్పుడూ పని చేయకండి. మీరు చేసే పనిని ఎంజాయ్ చేయండి. అలా చేస్తే మీకు కావాల్సిన డబ్బులు వాటంతట అవే వస‍్తాయి.
Success Story: పెట్టుబడి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు.. ఇదే నా సక్సెస్ మంత్ర..
మంచి భవిష్యత్ కావాలంటే..
ఒకవేళ డబ్బులు ఎక్కువగా వస్తున్న జాబ్‌లో మీరు జాయిన్ అయితే.. డబ్బులు వస్తున్నాయి. కాబట్టి పనిని ఎంజాయ్ చేయలేరు. ఉన్న జాబ్‌ను కూడా సక్రమంగా చేయలేరు. అందుకే మంచి భవిష్యత్ కావాలంటే పనని ఎంజాయ్ చేయాలని సూచించారు.
కిరాణా దుకాణంలో..
బఫెట్ తన తాత ముంగెర్కు చెందిన కిరాణా దుకాణంలో పని చేయడం ప్రారంభించారు. అయితే బఫెట్కు ఆ పని నచ్చకపోవడంతో సెక్యూరిటీలను విక్రయించే వ్యాపారంలోకి అడుగుపెట్టారు. బఫెట్ తాత ముంగెర్ లాయర్ వృత్తిని ప్రారంభించారు. అలా 1965లో ఇద్దరూ కంపెనీ నిర్వహణ, ఆర్థిక విధానాలను నియంత్రించేలా బెర్క్‌షైర్ హాత్వే కంపెనీ కంట్రోల్ స్టేక్‌ను కొనుగోలు చేశారు. జనరల్ మోటార్స్, కోకా కోలా కంపెనీ,యాపిల్ వంటి మెగా కంపెనీలలో 700 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాప్, హోల్డింగ్‌లతో ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగారు.
Success Story : మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్..నాడు చాలా కష్టం అన్నవాళ్లే నేడు..
వివిధ సందర్భాలలో చెప్పిన పంచరత్నాలు యువతరానికి తిరుగులేని పాఠాలు ఇలా..
1. ‘ఒక పనిపై అరకొర ఆసక్తి ఉంటే మాత్రమే సరిపోదు. అంతులేని ప్రేమ ఉండాలి. అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది’
చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే బఫెట్‌గా బాగా ఇష్టం. అంకెలతో ఆడుకునేవాడు. ఇంట్లో గోలగా ఉంటే ప్రశాంతత కోసం రెండు మూడు లెక్కల పుస్తకాలు పట్టుకొని స్నేహితుడి ఇంటికి పరుగెత్తేవాడు. లెక్కల మీద ఉన్న ప్రేమ అతడిని ‘డబ్బు’ దగ్గరికి తీసుకెళ్లింది. ‘డబ్బు ఎలా సంపాదించాలి?’ అనే తపన మొదలైంది. ఒక దశలో స్టేడియంలో తినుబండారాలలాంటివి కూడా అమ్మాడు. పదకొండవ ఏటే స్టాక్‌మార్కెట్ ప్రపంచంలోకి ప్రవేశించాడు. పదమూడేళ్ల వయసులో పన్ను రిటర్నులు దాఖలు చేశాడు.
Motivational Story: కుంగిపోలేదు.. పోరాడి గెలిచాడు.. తనతో పాటు నలుగురికి..
2. ‘రూల్ నెంబర్: 1 డబ్బు ఎప్పుడూ నష్టపోవద్దు.
రూల్ నెంబర్: 2 రూల్ నెంబర్ 1 ఎప్పుడూ మరచిపోవద్దు’
వన్స్ అపాన్ ఏ టైమ్‌లో పెట్టుబడుల రంగంలో ఉన్న ఒక కంపెనీలో భాగస్వామ్యం తీసుకోవడంతో పాటు దానికి మెనేజర్‌గా పనిచేశారు బఫెట్. అక్కడ నష్టాల పాలై బయటికి వచ్చారు. కానీ అతడికి రూల్ నెంబర్: 2 బాగా గుర్తుంది. ‘ఇక నష్టపోవద్దు’ అనే నిర్ణయానికి వచ్చారు. అలా అని భయపడుతూ కూర్చోనూలేదు. అమెరికాలో 1973-75లలో ఆర్థికమాంద్యం దెబ్బతో కొన్ని కంపెనీలు మూతపడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తక్కువ ధరతో వాటిని కొనుగోలు చేశారు. ‘తెలివి తక్కువ పని’ అనుకున్నారంతా. అది ఎంత తెలివైన పనో ఆతరువాత కాలంలోగానీ వారికి తెలిసిరాలేదు. వ్యాపారికి దూరదృష్టి ముఖ్యం. అది బఫెట్‌లో బహు బాగా ఉంది. అదే అతని విజయసూత్రం అయింది.
Inspiring Success Story : పరీక్షల్లో ఫెయిల్.. జీవితంలో పాస్.. ఏడాది రూ.2 కోట్ల పైగా ఆదాయంతో..
3. ‘నీకు తెలియని వ్యాపారంలోకి దూరకు’...
దీన్ని బఫెట్ గోల్డెన్ రూల్ అంటారు. ఫలనా వ్యక్తి చెప్పాడని ఇన్వెస్ట్ చేయవద్దు. ‘నువ్వు ఇన్వెస్ట్ చేయబోయే సంస్థ గురించి లోతుగా, క్షుణ్ణంగా హోంవర్క్ చేయాలి. ఇంటిని కొనేముందు వందసార్లు, వందరకాలుగా ఆలోచిస్తాం. స్ట్సాక్ కూడా అంతే’ అంటారు బఫెట్. నష్టాల్లో ఉన్న సంస్థలను కొనుగోలు చేసి వాటిని లాభాలబాట పట్టించారు బఫెట్. అలా అని నష్టాల్లో ఉన్న ప్రతీ సంస్థను ఎలాగైనా పైకి తీసుకురావాలనే నిరర్థక పట్టుదల ఆయనలో ఏమీ లేదు. విషయం అర్థంకాగానే పక్కకు తప్పుకొని ప్రత్యామ్నాయం ఆలోచించడం ఆయన నైజం. బెర్క్‌షైర్ హార్త్‌వేస్ టెక్స్‌టైల్ విషయంలో టెక్స్‌టైల్ అనేది ‘వరస్ట్ ట్రేడ్’ అనుకొని ఈ బిజినెస్‌ను ఇన్సూరెన్స్ సెక్టర్‌లోకి మళ్లించారు.
Inspiring Success Story: రూ.200 జీతం తీసుకునే గుమాస్తా.. కోట్లకు అధిపతి అయ్యాడిలా..
4. భవిష్యత్ గురించి ఎప్పుడూ ఆలోచించాలి..
‘కొందరు చెట్టు నీడలో కూర్చొని...ఎంత హాయిగా ఉంది అనుకుంటారు. ఎన్నో సంవత్సరాల క్రితం, ఎవరో ఒకరు విత్తనం నాటితేనే కదా ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నది. పెట్టుబడులు కూడా అంతే. భవిష్యత్ ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. లాంగ్‌టర్మ్ ప్లాన్‌లను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్‌లో ఒడిదొడుకులు వచ్చినా సంతోషంగా ఉండగలిగే చోట పెట్టుబడి పెట్టాలి’ అంటారు బఫెట్.
Success Story: ఏ ఒక్క కంపెనీ పెట్టకుండానే.. వేల కోట్లు సంపాదించాడిలా..
5. బఫెట్ నుంచి నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ లెసన్: ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్
ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ వయసులోనూ వ్యక్తిత్వవికాసానికి సమయం కేటాయిస్తారు బఫెట్. ‘నీకంటూ కొంత సమయం ఉండాలి...అనేది అమెరికన్ బిజినెస్‌లో కష్టమే కావచ్చు. కానీ నా కోసం నేను రోజూ ఎంతో కొంత సమయం తప్పక కేటాయించుకుంటాను. చదువుకుంటాను. ఆలోచిస్తాను. బిజినెస్‌లో వైవిధ్యంగా ముందడుగు వేయడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది’ అంటారు బఫెట్.
Mukesh Ambani: ముఖేష్ అంబానీ టాప్ సక్సెస్ సీక్రెట్స్ ఇవే..
వారెన్ బఫెట్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..
☛ 1000 వేస్ టు మేక్ 1000 డాలర్స్(1936), ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్(1949) అనేవి బఫెట్‌కు బాగా నచ్చిన పుస్తకాలు.
☛ వ్యాపారాలలో లాభాలు గడించడంలో ఎంత పేరుందో, దానధర్మాలు చేయడంలోనూ బఫెట్‌కు అంతే పేరుంది.
☛ చదవడం అంటే ఎంత ఇష్టమో, రాయడం అంటే కూడా అంతే ఇష్టం. సందర్భానికి తగ్గట్టు వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు.
☛ సంగీతం పట్ల ఆసక్తి ఉంది. కొన్నిసార్లు స్టాక్‌హోల్డర్ల మీటింగ్‌లో కూడా తనకు ఇష్టమైన వాయిద్యం యుకలేలి ప్లే చేస్తుంటారు.
☛ టీవీ షోలలో కనిపించండం బఫెట్‌కు సరదా. ఆయన జీవితంపై హౌ టు బికమింగ్ వారెన్ బఫెట్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మనీ మేకర్లాంటి డాక్యుమెంటరీ ఫీచర్స్ వచ్చాయి.
Success Story : మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్..నాడు చాలా కష్టం అన్నవాళ్లే నేడు..