SSC CGL Top Ranker: ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో 36 లక్షల మందిని వెనక్కినెట్టి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన రాజస్థాన్ కుర్రాడు.. ఇతని సక్సెస్ సీక్రెట్ ఇదే...
తాజాగా విడుదలైన ఈ ఫలితాల్లో రాజస్థాన్ కుర్రాడు అదరగొట్టాడు. 36 లక్షల మంది రాసిన పరీక్షల్లో సత్తా చాటి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
➤☛ SSC CGL నోటిఫికేషన్.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2022 ఫలితాలను (SSC CGL-2022) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన మోహిత్ చౌదరి మొదటి స్థానంలో నిలిచాడు. ఈ విజయాన్ని తన తల్లిదండ్రులు, తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు అంకితమిచ్చాడు.
మోహిత్ విద్యాభ్యాసం రాజస్థాన్‌లోని నసీరాబాద్ ఆర్మీ స్కూల్లో సాగింది. పాఠశాల విద్య తర్వాత మెకానికల్ విభాగంలో బీటెక్ పూర్తి చేశాడు. తర్వాత ఎస్ఎస్సీ సీహెచ్ఎల్ పరీక్షకు సిద్ధమయ్యాడు. అయితే మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఫస్ట్ అటెంప్ట్‌లో చేసిన తప్పులను బేరీజు వేసుకుని, మళ్లీ ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడ్డాడు.
➤☛ ఇది కదా సక్సెస్ అంటే... రోజుకు 1.6 లక్షలు.. ఏడాదికి 6 కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన కుర్రాడు
పక్కా ప్రణాళికతో రెండో సారి పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఏడాది పాటు ఇంటికి దూరంగా ఊరిని వదిలేసి వెళ్లిపోయాడు. సోషల్ మీడియాను బ్యాన్ చేశాడు. ఎలాంటి శుభకార్యాలకు హాజరయ్యేవాడు కాదు. కేవలం పరీక్షపైనే శ్రద్ధ పెట్టాడు. అతని కష్టానికి ఫలితం దక్కింది. రెండో ప్రయత్నంలో దేశంలోనే ఫస్ట్ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నాడు.
➤☛ మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి
మోహిత్ చౌదరి సాధించిన విజయాన్ని రాజస్థాన్ ప్రజలు ఓన్ చేసుకున్నారు. మోహిత్ విజయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. మోహిత్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ''మోహిత్ చౌదరి ఎస్ఎస్‌సీ సీజీఎల్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి యావత్ దేశంలోనే రాష్ట్ర ప్రతిభను చాటాడు. ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు అతడికి అభినందనలు. అతని ఉజ్వల భవిష్యత్తు కోసం నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ విజయం రాజస్థాన్ గర్వించదగ్గది'' అని ట్వీట్ చేశారు.
➤☛ రెండు కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన హైదరాబాదీ అమ్మాయి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో 35 హోదాల్లో దాదాపు 20 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టింది. వీటిలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్(ప్రివెంటివ్ ఆఫీసర్), ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్(గ్రూప్-బి), సీబీఐలో సబ్ ఇన్‌స్పెక్టర్(గ్రూప్-బి), కాగ్‌లో డివిజినల్ అకౌంటెంట్(గ్రూప్-బి) వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పరీక్షలోనే మోహిత్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు.