Free Foundation Course: ఉచిత కోర్సు దరఖాస్తు గడువు పొడిగింపు
Sakshi Education
స్టేషన్ మహబూబ్‌నగర్: మైనార్టీ విద్యావంతులైన యువతకు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ తరపున నాలుగు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సు కింద కోచింగ్ ప్రారంభించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి జనవరి 10న ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు దరఖాస్తు తేదీని ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడగించినట్లు పేర్కొన్నారు. గ్రూప్–1, 2, 3, 4, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్‌తోపాటు భవిష్యత్‌లో జరిగే ఇతర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు కోచింగ్ ఉంటుందన్నారు.
చదవండి: Free Coaching: ఉపాధి కోర్సుల్లో నాలుగు నెలలపాటు ఉచితంగా శిక్షణ
మైనార్టీ యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన మైనార్టీ యువత అవసరమైన సర్టిఫికెట్లు, దరఖాస్తును ఫిబ్రవరి 15 వరకు ఐడీఓసీలోని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు 9440970730 సంప్రదించాలని ఆయన సూచించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 13 Jan 2025 09:35AM
Tags
- Minority Educated Youth
- Telangana Minority Study Circle
- Career Counseling Centre
- Free Foundation Course
- group 1
- group 2
- Group 3
- Group 4
- RRB
- SSC
- Shankarachari
- Govt Jobs
- Competitive Exams
- Minority Welfare Department
- Telangana News
- Mahabubnagar District News
- TelanganaMinorityStudyCircle
- EducationalOpportunities